క్రీడల్లో పాల్గొనడం వలన క్రీడాకారుల్లో స్నేహభావాన్ని కల్గిస్తాయి, ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు

క్రీడలు

Vksakhapatnam: క్రీడల్లో పాల్గొనడం క్రీడాకారుల్లో స్నేహభావాన్ని కల్గిస్తాయని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు అన్నారు. ఏయూ స్విలర్ జూబ్లీ క్రీడా మైధానంలో బాస్కెట్ బాల్ పురుషులు, వాలీబాల్ పురుషుల పోటీలును ముఖ్యఅతిథిగా పాల్గొని మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ డిగ్రీ, పీజీ, ప్రొఫెసనల్ విద్యార్థులు వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తూ ఏదొక క్రీడలో పాల్గొనాలని సూచించారు. అనంతరం బాస్కెట్ బాల్ త్రో వేసి ప్రారంబించారు. అలాగే వాలీబాల్ సర్వీస్ చేసి ఇంటర్ కాలిజియట్ పొటీలు, ప్రారంభించారు. ఏయూ వ్యాయామ విద్యా విభాగం స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి, డైరెక్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడు తూ బాస్కెట్ బాల్, వాలీబాల్ పోటీల్లో ప్రతిభ సాదించిన క్రీడాకారులు సౌత్ ఇండియా యూనివర్శిట్ పోటీల లో పాల్గొనేందుకు ఆంధ్రాయూనివర్శిటి పురుషులు జట్టుకు ఎంపిక చేస్తామాన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, డాక్టర్ ఎల్.బి కళాలశాల పి.డి. డాక్టర్ లక్ష్మణరెడ్డి. ఎవిఎస్ కళాశాల పి.డి డాక్టర్ గోపికృష్ణ, గీతం యూనివర్శిటీ పూర్వ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ దిలీప్, పరిశోధకులు ఉదయ్ తదితర కళాశాలల పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *