Visakhapatnam, గత నెల అక్టోబర్ 26 నుండి 30వ తేదీలలో 12వ జూనియర్ జాతీయ టార్గెట్ బాల్ ఛాంపియన్షిప్ ని భోపాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ విద్యార్థులు బిఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న ఆర్.నిఖిల్, బిఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న జీ దీపక్ చక్రి అత్యంత ప్రతిభ ఘనపరిచి ఆలిండియా స్థాయిలో తృతీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి డాక్టర్ జి. మధు కుమార్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి ఎస్ కె చక్రవర్తి వ్యాయామక భాగాధిపతి డాక్టర్ వై. శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్.ఎస్ లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు.
