ఏయూకు రావ‌డంమే నాకు పెద్ద అవార్డు… మా నాన్నగారు చ‌దువుకున్న విశ్వ‌విద్యాల‌యం…సినీ న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌.

Uncategorized

విశాఖ ఎడ్యుకేషన్, ఏప్రియ‌ల్ 6 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :ఇక్క‌డ‌కు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి నా ఎమోష‌న్స్ ఆపుకోవ‌డానికి చాల క‌ష్ట‌ప‌డ్డాను, మా నాన్న గారు చ‌దువుకున్న విశ్వ‌విద్యాల‌యం, వందేళ్ల వేడుక‌లో పాల్గొన‌డం ఇది నాకు ల‌భించిన అవ‌కాశంగా భావిస్తున్నాన‌ని ప్ర‌ముఖ న‌టుడు రాజీవ్ క‌న‌కాల అన్నారు. ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో నిర్వ‌హిస్తున్న మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్‌లో ఆయ‌న తొలిరోజు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రై ప్ర‌సంగించారు. వందేళ్ల ప్ర‌స్థానం క‌లిగిన ఏయూకు రావ‌డం, ఇటువంటి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం త‌న‌కు ల‌భించిన అతిపెద్ద పుర‌స్కారంగా తాను భావిస్తున్నాన‌న్నారు. వేదిక‌పై ప్ర‌ద‌ర్శించిన నృత్యాల‌ను తాను వీక్షించాన‌ని, ప్ర‌తీ నృత్యం ఎంతో గ్రేస్‌, ఈజ్‌తో నృత్యం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. విశ్వ‌విద్యాల‌యం క‌ళ‌ల‌కు, సంస్కృతికి ఇస్తున్న ప్రాధాన్యం ఎంతో సంతోషాన్ని ఇస్తోంద‌న్నారు. క‌ళ‌లు, సాహిత్యానికి విశాఖ న‌గ‌రం పుట్టినిల్ల‌న్నారు. ఇక్క‌డకు వ‌చ్చిన వేలాదిమంది విద్యార్థుల ఆనందంలో తానుకూడా భాగం కావ‌డం ఎంతో సంతోషాన్ని ఇస్తోంద‌న్నారు.ఏ యూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ విద్యార్థుల నిబ‌ద్ధ‌త స‌మిష్టి కృషికి నిద‌ర్శ‌నంగా వేదిక‌పై ప్ర‌ద‌ర్శిస్తున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిలుస్తున్నాయ‌న్నారు. ఇది విశ్వ‌విద్యాల‌యం చ‌రిత్ర‌లో ఒక అపూర్వ ఘ‌ట్టంగా నిలుస్తుంద‌న్నారు. ఇక్క‌డ వేదిక‌పై ప్ర‌ద‌ర్శిస్తున్న నృత్యాలు ఉత్స‌వ సంద‌డిని తీసుకువ‌చ్చాయ‌న్నారు. యువ‌త‌లో ఉత్సాహం ఇక్క‌డ క‌నిపిస్తోంద‌న్నారు. కార్య‌క్రంమ‌లో పాల‌క మండ‌లి స‌భ్యులు ఆచార్య సాంబిరెడ్డి, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది ర‌వి, ఆచార్య జి.గిరిజా శంక‌ర్‌, ఆచార్య సీతామాణిక్యం, ఆచార్య ఎం.శ‌శి, ఆచార్య ప‌ద్మ‌శ్రీ‌, ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, నిర్వాహ‌కులు ఆచార్య ఎన్‌.ఎం యుగంధ‌ర్‌, ఆచార్య సి.హెచ్ ఆశా ఇమ్మానిక‌ల్ రాజు, ఏయూ ఆచార్యులు, విద్యార్థులు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు. అనంత‌రం ఏయూ విద్యార్థులు, అనుబంధ క‌ళాశాల‌ల విద్యార్థులు వేదిక‌పై ప్ర‌ద‌ర్శించిన శాస్త్రీయ‌, వెస్ట్ర‌న్ నృత్యాలు, యోగా విభాగం విద్యార్థుల యోగ విన్యాసాలు, జాన‌ప‌ద క‌ళా రూపాలు ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *