
విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 3 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం మహిళల బేస్ బాల్ జట్టు ఎంపిక జరిగింది. బేస్ బాల్ మహిళా జట్టు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటి పాల్గొన నుంది. ఈ పోటీలు మహారాష్ట్రలో పూనే బారామతి టీసీ కళాశాల |బారామతి జిల్లా పూనే లో జనవరి 6వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఆల్ ఇండియా యూనివర్శిటి బేస్ బాల్ మహిళల పోటీలు జరగనున్నాయని ఏయూ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆచార్య ఎ. పల్లవి తెలిపారు. ఈసందర్భంగా బేస్ బాల్ మహిళా జట్టు క్రీడాకారులను అభినందించారు. ఏయూ వ్యాయామ విద్యా విభాగం జిమ్నాజియంలో జరిగిన కార్యక్రమంలో బేస్ బాల్ జట్టు తోపాటు కోచ్ గొన్నాకాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రిన్సపల్ కరుణ క్రీడాకారులు పాల్గొన్నారు.
