
విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 2 : ఆంధ్రాయూనివర్శిటి యోగా మహిళల జట్టు ఎంపిక జరిగింది. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటి కి వెళ్లే మహిళల యోగా జట్టు బెంగుళూరు డీమ్డ్ యూనివర్శిటి స్వామి వివేకానందా యోగా అనుసంధాన సంస్థాన లో జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు యోగా పోటీలు జరగనున్నట్లు ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్ విజయమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు. ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి తెలియజేస్తూ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో పాల్గొనేందుకు ఏయూ నుంచి పి. జయలక్ష్మి, సిహెచ్ శిరీష, బి. ఢిల్లేశ్వరి, ఎ. సరస్వతి, ఎ. రాజేశ్వరి, బి. వనజ ఎంపికయ్యారన్నారు. కోచ్ గా కె.వి.ఎన్ మూర్తి ఉన్నారని తెలిపారు.
