
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 29 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో నాలుగేళ్ల బిఎస్సీ ఆనర్స్, ఏడాది ఎం.ఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్న కె. బిందు మాధవి కి స్కేటింగ్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇటీవల 63 వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖలో డిసెంబర్ 5 నుంచి 15 వరకు జరిగాయి. ఈపోటీల్లో ఏయూ క్రీడాకారిణి కి ఇన్ లైన్ అప్ లైన్ లో సిల్వర్ మెడల్ సాదించిన సందర్భంగా ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ సోమవారం ఆయన ఛాంబర్ లో క్రీడాకారిణి బిందు మాదురిని అభినందించారు. రాబోయే కాలంలో అంతర్జాతీయంగా ప్రతిభ సాదించి వర్సిటికీ పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్.విజయమోహన్ పాల్గొన్నారు.
