ఆంధ్రవిశ్వవిద్యాలయ ఖోఖో పురుషులు జట్టు ఎంపిక

క్రీడలు

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఖోఖో పురుషుల జట్టు ఎంపిక జరిగింది. ఖోఖో ఏయూ జట్టు క్రీడాకారులను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య ఎన్. విజయమోహన్ ఆదివారం విభాగం లో అభినందించారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మార్చి 26 నుంచి 29 వరకు కర్ణాటక దేవంగీర్ యూనివర్శిటిలో పురుషుల ఖోఖో పోటీలు జరుగుతాయన్నారు. ఈ జట్టులో 14 మంది క్రీడాకారులను ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జట్టు కోచ్, మేనేజర్ తోపాటు కెప్టెన్, క్రీడాకారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *