

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 15 : చదువుతోపాటు క్రీడలు ఉండాలని, క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థానాలను అదిరోహించవచ్చని గొన్నా గ్రూప్స్ ఇనిస్టిట్యూషన్స్ సెక్రటరీ జి. హేమచంద్ నాయుడు అన్నారు. సోమవారం గొన్నా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్రీడా మైదానంలో బేస్ బాల్ పురుషులు, మహిలకు ఆంధ్రాయూనివర్శిటి జట్టు ఎంపిక జరిగింది. ఈసందర్భంగా కార్యదర్శి హేమచంద్ నాయుడు మాట్లాడుతూ ఆల్ ఇండియా యూనివర్శిటి కి ఏయూ తరపున వెళ్లే క్రీడాకారులు ఎంపిక కు హాజరైన వివిధ కళాశాలల క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో ప్రతిభావంతులకు మంచి గుర్తింపు తోపాటు ఉపాధి లభిస్తుందన్నారు. ఆల్ ఇండియా యూనివర్శిటి బేస్ బాల్ పోటీలు సావిత్రిబాయ్ పూలే, పూనే యూనివర్శిటిలో పోటీలు జరుగుతాయని, పురుషుల పోటీలు జనవరి 2 నుంచి 6 వరకు, మహిళల పోటీలు జనవరి 6 నుంచి 10 వరకు జరుగు తాయన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ సెలక్షన్ కమిటి మెంబర్ డాక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియా యూనివర్శిటి కి వెళ్ల బేస్ బాల్ పురుషుల మహిళల జట్టు ఎంపికకు మహారాజా కాలేజ్ విజయనగరం, ప్రగతి వ్యాయామ విద్యా కళాశాల కొత్తవలస, ఎస్ఓస్ డిగ్రీ కళాశాల, ఏయూ ఆర్ట్స్ కళాశాల విశాఖపట్నం, గొన్నా కళాశాల అగనంపూడి, అనిట్స్ కళాశాల తగరపు వలస, ఎఎంఎఎల్ కళాశాల, అనకాపల్లి తదితర కళాశాలల క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి.ఎస్.ఎన్. మూర్తి, వ్యాయామ విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ కరణాకర్ కుమార్,ఫాకల్టీ పోతురాజు, క్రీడాకారులు, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
