25 న ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవం -హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ డాక్టర్ ఎస్. అబ్దుల్ నజీర్ -ముఖ్య అతిధిగా బ్యాంక్ అఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి -స్నాతకోత్సవంలో పాల్గొంటున్న విద్యశాఖ మంత్ర నారా లోకేష్

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం 91,92వ సంయుక్త స్నాతకోత్సవం ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తెలిపారు. శనివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నాతకోత్సవానికి ఏయూ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తి హాజరవుతున్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం తరపున ఆయనకు గౌవర డాక్టరేట్ను ప్రధానం చేస్తామని చెప్పారు. సాహిత్య విభాగంలో విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి కి ఏయూ తరపున డాక్టరేట్ ప్రధానం చేస్తామన్నారు. స్నాతకోత్సవం ఉదయం 9 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ స్నాతకోత్సవంలో ఇద్దరు ఆచార్యులకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు, పిహెచ్ఎలో రీసెర్చ్ మెడల్స్ 17 మందికి, రీసెర్చ్ ప్రైజ్లు 13 మందికి ప్రధానం చేస్తారు. 7 ఎం.ఫిల్ డిగ్రీలను, 441మంది పిహెచ్ డి డిగ్రీలను అందుకుంటారు. యూజీ పీజీ మెడల్స్ 174, యూజీ పీజీ ప్రైజులు 437 అందిస్తారు. మెత్తం యూజీ పీజీ ప్రైజులు, మెడల్స్ 148 మందికి అందిస్తున్నారు.సమావేశంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, అకడమిక్ డీన్ ఆచార్య కె.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *