


విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 23 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ (అ) అండ్ డిపార్ట్మెంట్ అఫ్ జనరల్ మెడిసిన్ అఫ్ గాయత్రీ విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఋషికొండ కళాశాల ప్రాంగణం లో సోమవారం ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం మేనేజంగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జకల్ ఒంకలోజిస్ట్ డా.వి.మురళీకృష్ణ ముఖ్యఅతిధి గా హాజరియ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల వినియోగం గురించి చర్చించనున్నారు. హెల్త్ కేర్ రంగంలో వినియోగం పెరుగుతోందిని , ఇది వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుందన్నారు. డా. ఎం. రామ కృష్ణ, రీసెర్చ్ ఫెలో, జార్జ్ మెసన్ యూనివర్సిటీ, యూ ఎస్ ఏ అతిధిలు గా విచ్చేశారు. జీ వీ పి మెంబర్ డా. పీ. రాజగణపతి అధ్యక్షత గా వ్యవహారించారు. ఈ జీవిపి సెక్రటరీ పి. సోమరాజు, వైస్ ప్రెసిడెంట్ డి. దక్షిణా మూర్తి , ప్రిన్సిపాల్ ప్రో. కే ఎస్ బోస్, ప్రోగ్రాం కన్వీనర్స్ డా. ఎన్. వి. రమణ మూర్తి, డా. వి. ధర్మారావు, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఫాకల్టీ విద్యార్థులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.
