
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 15 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గీతం రోటరాక్ట్ క్లబ్, జిమ్‌సర్ ఆసుపత్రి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిభిరాన్ని డాక్టర్ అంజుచౌదరి ప్రారంభించారు. ఈ రక్తదాన శిభిరంలో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్చందంగా రక్తదానం చేశారు. రోటరక్ట్ బ్లడ్ బ్యాంక్, జిమ్‌సర్ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి నిపుణులు హజరై విద్యార్ధులనుంచి రక్తాన్ని సేకరించారు. రక్తదానం ద్వారా దాతల ఆరోగ్యం సహితం మెరుగు పడుతుందన్నారు. సామాజిక బాధ్యతగా యువత స్వఛ్చంద రక్తదానానికి ముందుకు రావడం ద్వారా అత్యవసర పరిస్థితులలో ఉన్నవారి ప్రాణాలు నిలుస్తాయని యువత స్వచ్చంద రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, విద్యార్ధులు పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేసిన వారిని హేమంతబగ్గా, చలపతిరావు, కాదంబరి తదితరులు అభినందించారు.
