ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ మేనేజ్మెంట్ విభాగపు ఆచార్యులు… ఆచార్య జాలాది రవి…. ప్రిన్సిపాల్ గా బాధ్యత స్వీకరించిన ఆచార్య జాలాది రవి.

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 24 మేజర్ న్యూస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ మేనేజ్మెంట్ విభాగపు ఆచార్యులు ఆచార్య జాలాది రవి నియమితులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ నేడు అయన కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వులను ఆచార్య జాలాది రవి కి అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.ఆంధ్రా యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా మానేజ్మెంట్ సీనియర్ ఆచార్యులు ప్రొఫెసర్ జాలాది రవి బుధవారం నాడు పదవి భాధ్యతలు స్వీకరించారు. ఆచార్య ఏ నరసింహ రావు ఆచార్య జాలాది రవికి బాధ్యతలు అప్పజెప్పారు. అంతకుముందు వైస్ ఛాన్సలర్ ఆచార్య జీ పీ రాజశేఖర్ ఆచార్య రవి కి ఉత్తర్వులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *