

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: ఆంధ్రవిశ్వవిద్యాలయం టైక్వాండో పురుషులు, మహిళల జట్టు ఎంపికలు గురువారం ఏయూ న్యూ జిమ్నాజియంలో జరిగాయి. ముఖ్యఅతిథిగా డీన్ ఇంఫ్రా ప్లానింగ్ ఆచార్య కె. శ్రీనివాసరావు పాల్గొని ప్రారంబించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. టైక్వాండో జట్టు లు యూనివర్శిటి పోటీల్లో ప్రతిభ సాదించి వర్సిటికి మంచి పేరు తేవాలన్నారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ టైక్వాండో పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు టి.ఎ డి.ఎ తోపాటు ట్రాక్ సూట్స్ వంటి క్రీడా పరికరాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈసందర్భంగా క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏయూ చీఫ్ ఇంజనీర్ తిరుపతిరావు, అసోసియేట్ డీన్ ఇంఫ్రా ప్లానింగ్ ఆచార్య అధిసేషు, డ్రాప్ట్మన్ పైడిరాజు, సాంకేతిక కళాశాల పిడీ సురేష్, కోచ్ రమేష్ సెంట్ జోసెప్ కళాశాల పిడీ ప్రవీణ్, గాయత్రీ కళాశాల పిడీ మంగళ గౌరీ, నక్కపల్లి జీడీసీ పీడీ దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.
