

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : సముద్ర ఆధారిత ఉత్పత్తులతో ఔషధాల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాద్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ కేరళ గౌరవ ఆచార్యులు కె.వి జయచంద్రన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు, మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా మెరైన్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ…. అగ్రికల్చరల్, మెరైన్, ఫార్మ, సోలార్, ఎలక్ట్రాన్రిక్స్ రంగాలలో ఆంధ్రప్రదేశ్ అద్వితీయ ప్రగతిని సాధిస్తోందన్నారు. మత్స్య సంబంధ ఉత్పత్తులలో దేశంలో సగానికిపైగా ఉత్పత్తి ఏపీ నుంచే జరుగుతోందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో సైతం బయో ఫార్మసూటిక్స్ అభివృద్ధికి ప్రోత్సాహం అందించిందని గుర్తుచేశారు. ఐఐటి ఖర్గపూర్ ఆచార్యులు ప్ర సాద్ కుమార్ భాస్కరన్ మాట్లాడుతూ పర్యావరణ మార్పులకు లోనవుతున్న తరుణంలో మనమంతా ప్రయాణం చేస్తున్నామన్నారు. కేవలం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల తీవ్ర పరిణామాలకు కారణంగా నిలుస్తుందన్నారు. కైమేట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇవి ఎంతో సంక్లిష్టమైనవన్నారు. విభిన్న శాస్త్రా ల నిపుణులు వీటిలో కలసి పనిచేయడం జరుగుతుందన్నారు. సముద్ర పర్యవరణాన్ని సంరక్షించడం ఎంతో అవసరమన్నారు. అప్పుడే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సంరక్షించడం, సుస్థిర పరచడం ఎంతో అవసరమన్నారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ సముద్ర పర్యవరణ పరిరక్షణకు ప్రతీ వ్యక్తి ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో పరిశోధనలకు అనేక సంస్థలు నిధులు అందిస్తున్నాయన్నారు. విభిన్న సంస్థలు, నిపుణులు ఒక కన్సార్షియంగా ఏర్పడి వీటికి దరఖాస్తు చేయాలని సూచించారు. యువత సముద్ర పర్యావరణ సంరక్షణకు, అవసరమైన విధానాలను రూపొందించే విధంగా దృష్టిసారించాల్సిన అవసరం యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో రీసెర్చ్ ప్రొఫెసర్ డి.వి సుబ్బారావు మాట్లాడుతూ ” సముద్రాలు అనేక మార్పులకు లోనవుతున్నాయన్నారు. ప్రజలు, సమాజం, విశ్వవిద్యాలయాలు వీటి సంరక్షణకు నడుంబిగించి పనిచేయాలన్నారు. కంప్యూటర్ రంగం రాజ్యమేలుతున్న రోజుల్లో యువత జీవశాస్త్రా లను అధ్యయనం చేయడం మంచి పరిణామమన్నారు. జీవ వైవిధ్యత దిశగా యువత పరిశోధనలు జరపాలని సూచించారు. సముద్ర అధ్యయనంపై విశ్వవిద్యాలయం పరిశోధనలు జరపాలని సూచించారు. సదస్సు అద్యక్షులు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ మానవ ఆలోచనల్లో మార్పు తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ప్రతీ వ్యక్తి జీవితం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. సముద్ర కాలుష్యం అనేక వ్యవ స్థలను ప్రభావితం చేస్తుందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మలేషియా ఆచార్యులు ఎఫి హెల్మే అరిఫిన్ మాట్లాడుతూ సముద్ర పర్యావరణం దెబ్బతింటే ఆహారకొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. సముద్రాలను పరిరక్షించుకోవాలని, తీర ప్రాంతంలో జీవ వైవిధ్య క్షీణత ఆందోళన కలిగిస్తోందన్నారు. సదస్సు కన్వీనర్ ఆచార్య కె.రమేష్ బాబు మాట్లాడుతూ ఓషన్ హెల్త్, మత్స్య సంపద పరిరక్షన, మత్స్యకారుల జీవనాన్ని పరిరక్షించడం ప్రధానంగా సదస్సులో నిపుణులు ప్రసంగాలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో కోన బే మెరైన్ రిసోర్సెస్ ఆసియా టెక్నికల్ సపోర్ట్ మేనేజర్ నరిమోన్ నతమ్మో మత్స్య సంబంధ పరిశ్రమలు ఎదర్కొంటున్న వివిధ సమస్యలు, వ్యాధులు, నివారణ చర్యలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, అతిధులను జ్ఞాపికలతో సత్కరించారు.
