అభిరుచి, ఆసక్తి ఉండటం చాలా ప్రధానం..ట్రాన్స్ ఫార్స్ హేబిట్స్ డైరెక్టర్ ఇంద్రాణి యశోధ కొంపెల్ల…. జన్యుపరమైన, కాలుష్యం, ఆహార అలవాట్లు, మానసిక అంశాలు సంతానంపై ప్రభావం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు

ఎడ్యుకేషన్

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: వృత్తిపరమైన ప్రగతి సాధించాలంటే సంబంధిత అంశంపై అభిరుచి, ఆసక్తి ఉండటం చాలా ప్రధానమని ట్రాన్స్ ఫార్స్ హేబిట్స్ డైరెక్టర్ ఇంద్రాణి యశోధ కొంపెల్ల అన్నారు. గురువారం ఏయూ సైకాలజీ విభాగలో శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అప్లయిడ్ బిహేవియర్ అనాలసిస్ ఇన్ ఇటిజం-ఫౌండేషన్స్ చాలెంజెస్ అండ్ ప్రాక్టీస్ కాంటెక్ట్స్ అంశంపై ప్రసంగించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశంలో గ్రామీణ ప్రాంతంలో నేటికీ ఆటిజంపై సరైన అవగాహన లేదని, తన వ్యక్తిగత అనుభవాలను ఉదాహరణలతో వివరించారు. అభ్యసనంలో లోపాలు, మానసిక, మనో వైకల్యం కలిగిన వారిని గుర్తించడం ఎంతో అవసరమన్నారు. అప్లయిడ్ బిహేవియర్ అనాలసిస్ (ఏబిఏ) లోని ప్రధానమైన శాస్త్ర విజ్ఞాన్ని తెలుసుకుంటే, విభిన్న దశల్లో దీనిని వినియోగించే అవకాశం ఏర్పడుతుందన్నారు. నేటి తరం కనీసం 30 సెకన్లు సమయం కూడా ఒక అంశంపై కేంద్రీకరించలేకపోతోందన్నారు. ఆటిజం లక్షణాలను వివరిస్తూ, వారి ప్రవర్తనను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు. ఆసక్తి దాయకంగా పలు ఉదాహరణలో ప్రసంగాన్ని అందించారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానమిచ్చారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ జన్యుపరమైన, కాలుష్యం, ఆహార అలవాట్లు, మానసిక అంశాలు సంతానంపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఆరోగ్యకరమైన సంతానం కోరుకునే వారు ఎంతో జాగ్రత్తగా ఈ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని చెప్పారు. భారత దేశంలో వివిధ మనో వైకల్యంతో జన్మించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందన్నారు. కార్యక్రమంలో విభిగ పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *