

విశాఖపట్నం, జనవరి 30 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : 19 వ సీఎంఆర్ అయిష్ట టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం ఉదయం ఆఫీసర్ క్లబ్ లో అన్ని కేటగిరీల్లో ఫైనల్స్ మ్యాచులు హోరాహోరీగా సాగాయి అంతర్జాతీయ స్థాయి మరిపించేలా క్రీడాకారులు ఆడారు. గెలిచిన వారికి బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం శాసనసభ సభ్యులు గంట శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఆయన మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా సుమారు 35 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు పైబడిన వారు టోర్నమెంట్ లో పాల్గొని ఆడటం ఇక్కడ జరిగే ఈ టోర్నమెంట్ కు అతిధిగా పిలిచి బహుమతి ప్రధానం చేయడం చాలా ఆనందకరంగా ఉందని ప్రతి ఏడాది ఈ టోర్నమెంట్ జాతి స్థాయిలో రూపొందించడం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి టాప్ ర్యాంక్ లో ఉన్న క్రీడాకారులు పాల్గొని ఇందులో ఆడటం అనేది ఒక విశేషం అని ఈ టోర్నమెంట్ను ప్రతి ఆడది క్రమం తప్పకుండా ఇంతే బాగా నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి ఎస్ ఎన్ రాజుకి మరియు టోర్నమెంట్ డైరెక్టర్ కె సతీష్ కు అలాగే ఈ టోర్నమెంట్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం అధినేత మావురి వెంకటరమణ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల మంచి అవగాహన ఉందని క్రీడలకు మంచి ప్రోత్సహిస్తుందని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశలో ఇంకా ఇలాంటి ఎన్నో టోర్నమెంట్లో నిర్వహిస్తామని ఇందులో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం జరిగిన అండర్ 12 అండర్ 14 బాల బాలికల ఫైనాన్స్ మ్యాచ్లో గెలుపొందిన వారికి మాజీ డిజిపి ఎం సాంబశివరావు బహుమతి ప్రధానం చేశారు. శుక్రవారం ఉదయం జరిగిన ఓపెన్ మెన్ టబుల్స్ మ్యాచ్ ఉత్సాహంగా జరిగింది కన్న, శివ జోడి పై అనంత్, సిద్ధార్థ్ జోడి 9-6 స్కోర్ తో గెలుపొందారు ఇందులో ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ డి ఎస్ ఎన్ రాజు , టోర్నమెంట్ డైరెక్టర్ కె సతీష్, అయిష్ట ప్రెసిడెంట్ ఏ రామారావు, సుధా గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, అయిష్ట వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్చంద్, చిల్డ్రన్స్ టోర్నమెంట్ ఆర్గనైజర్ నడింపల్లి కృష్ణంరాజు, డాక్టర్ బి స్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

