ఏయూ వెయిట్ లిఫ్టింగ్ పురుషులు, మహిళల జట్టు ఎంపిక …క్రీడాకారులను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ అభినందన

క్రీడలు


విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 7 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం పురుషులు, మహిళలు, వెయిట్ లిఫ్టింగ్ యూనివర్శిటి జట్టు ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా ఏయూ పురుషులు, మహిళల జట్టు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ అభినందించారు. ఈసందర్భంగా తెలియజేస్తూ సౌత్, వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ పోటీలు ఎస్.ఎ.జి.ఈ. యూనివర్శిటీ భూపాల్ లో ఈ నెల 10,11 తేదీల్లో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు, 13 నుంచి 15 వరకు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఏయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆచార్య ఎ. పల్లవి మాట్లాడుతూ పురుషుల వెయిట్ లిఫ్టింగ్ జట్టులో డాక్టర్ఎల్బి కళాశాల నుంచి కె. దిలీప్ కుమార్, ఎం. తరుణ్, జి. సునీల్, వి. జశ్వంత్, సిహెచ్. అజయ్ ఎంపిక అయ్యారని, ఎవిఎన్ కళాశాల నుంచి పి రాము.ఆర్ రమణ ఉన్నారు. కె. దినేష్ ఎస్ఎస్ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల విజయనగరం, వి. అకిల్ ఎస్ఎల్ఎ డిగ్రీ కళాశాల విజయనగరం, ఆర్. రాంబాబు సత్యా డిగ్రీ కళాశాల విజయనగరం ఎంపికయ్యారు. మహిళల విభాగంలో డాక్టర్ ఎల్బి కళాశాల నుంచి పి. తేజశ్రీ, జి. పూజిత, ఎన్. కె. పట్నాయక్, సత్యా డిగ్రీ కళాశాల నుంచి టి. లావణ్య, ఎ. యసశ్రీ, ఎస్ఎల్ఎజి డిగ్రీ కళాశాల నుంచి ఎస్. పల్లవి, బి. హారిక, విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుంచి ఎం. అశ్విని, ఎవిఎన్ కళాశాల నుంచి ఎ. రేవతి, పి. లక్ష్మీ సాయి, వెయిట్ లిఫ్టింగ్ ఏయూ జట్టు లో ఉన్నారని ప్రొఫెసర్ ఏ పల్లవి తెలిపారు. జట్టు మెనేజర్ గా లంకపల్లి బుల్లయ్య కళాశాల వ్యాయామ విద్యా విభాగం హెడ్ డాక్టర్ వై. శ్రీనివాసరావు, మహిళా కోచ్ గా పి. వెంకటేశ్వరరావు, పురుషుల విభాగం కోచ్ గా సిహెచ్ రాము ఉంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *