

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 27 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం కలిపిస్తుందని విశాఖ ఏపీ శ్రీ భరత్ అన్నారు. 19వ సీఎంఆర్ అఖిలభారత సీనియర్ టెన్నిస్ పోటీలు మంగళవారం మెయిన్ పోటీలును ఆఫీసర్ క్లబ్ లో ప్రారంబించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా ఆనందించాల్సిన విషయంని, అలాగే టెన్నిస్ క్రీడ అనేది చాలా ఖర్చుతో కూడుకుని ఆటని ఈసారి రాష్ట్ర, జాతీయ, అంతర జాతీయ క్రీడాకారులు 350 మంది పాల్గొనడం. పట్ల అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్ ను ఇంత బాగా నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ను మెచ్చుకున్నారు. అలాగే ప్రతి ఆట ఈ టోర్నమెంట్కు సహాయం అందిస్తున్న సీఎంఆర్ రమణ క్రీడాలకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ పోటీలో పాల్గొనడం అంటే అంత ఆషామాషీ కాదని, అలాగే ఈ టోర్నమెంట్ లో 35 సంవత్సరాల వయసు దగ్గర నుండి 75 సంవత్సరాల వయసు ఉన్న క్రీడాకారులు పాల్గొనడం చాలా ఆనందదాయకమని అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా క్రీడలు ఆడుతూ ఉండాలని అప్పుడే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటదని కనుక ప్రతి ఒక్కరు ఏదో క్రీడలో ఉండాలని అన్నారు కార్యక్రమంలో మాజీ డిజిపి సాంబశివరావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అయిష్ట టోర్నమెంట్ అనేది ఏడు చోట్ల జరుగుతుందని అందులో విశాఖపట్నం లో బాగా జరుగుతుందని దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో షాప్ చైర్ పర్సన్ ఏవి రవి నాయుడు సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, మాజీ డిజిపి సాంబశివరావు, టోర్నమెంట్ డైరెక్టర్ కే. సతీష్, మాజీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి శాంతారావు, జాయింట్ కమిషనర్ వుడా, ఆఫీసర్స్ క్లబ్ సెక్రెటరీ కే రమేష్, అయిష్ట వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ చంద్, , టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి ఎస్ ఎన్ రాజు, అయిష్ట సెక్రెటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
19 వ సీఎంఆర్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన ఏం. పి శ్రీభరత్

