
విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం బాల్ బ్యాడ్మింటిన్ మహిళల యూనివర్సిటి జట్టు ఎంపికలు ఏయూ టెన్నిస్ ప్రాంగణంలో జరిగాయి. ఈపోటీలను ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి పాల్గొని శనివారం ప్రారంభించారు. బాల్ బ్యాడ్మింటెన్ పోటీల్లో పాల్గొన్న వివిధ కళాశాలల క్రీడాకారులను అభినందించారు. ఇక్కడం ఎంపికయిన క్రీడాకారులు సౌత్ ఇండియా బాల్ బ్యాడ్మింటెన్ పోటీల్లో పాల్గొనేందుకు అకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఐఐపిఈ స్పోర్స్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సమతా కళాశాల పీడీ రామకృష్ణ, పి డి రాజేష్, గాయత్రీ కళాశాల పీడీ డాక్టర్ ఉమాదేవి, పిడి మంగళగౌరి, సెంట్ యాన్స్ వీడీ సంధ్యారాణి. వివిధ కళాశాలలు నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
