గాజువాకలో ఘనంగా శ్రీ రాజమతంగీశ్వరీ దేవి సప్తదశ నవరాత్రి ఉత్సవాలు

ఆధ్యాత్మికం

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : గాజువాకలో శ్రీ రాజమతంగీశ్వరీ దేవి సప్తదశ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి శ్యామలానంద నాథ ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా రాజమాతంగి అమ్మవారి ఆరాధన, హోమాల ప్రాముఖ్యతను స్వామీజీ వివరించారు. అమ్మవారి అనుగ్రహంతో జ్ఞానం, విద్య, శక్తి మరియు శాంతి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. నవరాత్రుల్లో నిర్వహించే హోమాలు, పూజలు భక్తుల జీవితాల్లో అడ్డంకులను తొలగించి శుభఫలితాలను ప్రసాదిస్తాయని తెలిపారు. ఈరోజు పంచమి తిథి సందర్భంగా ప్రత్యేకంగా సరస్వతీ పూజ, హోమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృప కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం మంత్రోచ్చారణలతో, భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు వరకు విశేష పూజలు, హోమాలతో కొనసాగనున్నాయని వర్గాలు వెల్లడించాయి. ఈ క్యూ ఫర్ పీస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *