గీతంలో సౌత్ జోన్ చదరంగం పోటీలు ప్రారంభం

క్రీడలు


విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఎఐయు) ఆధ్వర్యంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేధికగా దక్షిణ మండల (సౌత్ జోన్) అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల చదరంగం (చెస్) పోటీలను శనివారం గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎరోల్ డిసౌజా ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. దక్షిణ మండల (సౌత్ జోన్) అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల చదరంగం (చెస్) పోటీలకు లక్ష్మిభాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేషన్ డీన్ (గాల్విvయర్) కష్ణకాంత్ సాహు పరిశీలకులుగా వ్వవహరిస్తిన్నారు. సౌత్ జోన్ చదరంగం (మహిళలు) పోటీలకు దక్షిణ భారత దేశంలోని 80విశ్వవిద్యాలయాల నుంచి 400 మంది చదరంగం క్రీడాకారిణులు పోటీలలో పాల్గొన్న మహిళలను అభినందించారు. చెస్ క్రీడా మానసిక సామర్ధ్యాన్ని పెంపోందించే అధ్బుతమైన క్రీడా అని పేర్కొన్నారు. అత్యధికంగా కర్ణాటక నుంచి 31 జట్లు, తమిళనాడు నుంచి 19 జట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి 19 జట్లు, తెలంగాణా నుంచి 8, కేరళ నుంచి 7 జట్లు చొప్ప్పున, పాండిచ్చేరి నుంచి 2 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. గత ఏడాది విజేతలుగా నిలిచిన మద్రాసు విశ్వవిద్యాలయం, అన్నా విశ్వవిద్యాలయం, భారతీయార్ విశ్వవిద్యాలయం, ఎసఆరఎమ్ విశ్వవిద్యాలయం ఈ జట్లు చెస్ వరల్డ్ ర్యాంకింగ్ క్రీడాకారిణిలు, దాదాపు 50 మంది కోచ్‌లు, మేనేజర్‌లు పాల్గొన్నారు. పోటీలకు ఛీఫ్ ఆర్బిట్రేటర్ గా జి.వి.కుమార్, సహయ ఆర్బిట్రేటర్‌లుగా ప్రసాద్, శ్రీకాంత్‌లు వ్యవహరించారు. కార్యక్రమంలో గీతం కేంపస్ లైఫ్ అసోసియేట్ డీన్ అరుణ్‌కార్తీక్, గీతం క్రీడా విభాగం డిప్యూటీ డైరక్టర్ జి.శ్రీనివాస్, గీతం క్రీడా విభాగం సీనియర్ మేనేజర్ కె.తపశ్వి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *