కనక మహలక్ష్మి అమ్మ వారి మార్గశిరమాసోత్సవాలు

ఆధ్యాత్మికం

Visakhapatnam, November 23 : విశాఖ లో వెలసిన శ్రీ కనక మహలక్ష్మి అమ్మవారి మార్గ శిర మాసొస్తవంలో బాగంగా ఆదివారం లక్ష్మీహోమం, వేదపారాయణ, సప్తశతి పారాయణ, మహావిద్యాపారాయణ, పూర్ణాహుతి నిర్వహించుట జరిగినది. విశ్వావసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమినీ పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం మార్గశిరమాసం సందర్భంగా శుక్రవారం నుండి ఆదివారం వరకు అష్టదళ పద్మారాదన, సహస్ర తుటసి పూజ, ఆయుష్ హోమం, లక్ కుంకుమార్చన మరియు కుంకుమ పూజలు విలుపుదల చేయడమైనది. మార్గశిరమాసోత్సవము సేవలు మార్గశిర పంచామృతాభిషేకం లక్ష్మీవారం రూ.10,000/ మార్గశిర లక్ష్మీవారం మినహా మిగతా రోజులలో పందొమ్మరాభిషేకం రూ. 3.000/- మార్గశిర లక్ష్మీవారం మినహా మిగతా రోజులలో క్షీరాభిషేకం రూ.1,116/- మరియు మార్గశిర విశిష్ట దర్శనము టిక్కెటు రూ.500/- ముందుగా ఆన్ లైన్ వెబ్ సైట్ www.aptemples.org 200 WhatsApp governance 30 9552300009 చేసుకొనవచ్చునని తెలియ జేయడమైనది. మార్గశిరమాసం ఉత్సవముల సందర్భంగా దర్శనముల ఎంట్రీ మార్గముల వివరములు .500/- దర్శనం,రూ.200/- దర్శనం,టౌన్ కొత్త రోడ్డు నుండి మొదలఉంటుంది. రూ. 100/- దర్శనం రీడింగ్ రూమ్ ధర్మ దర్శనం విక్టోరియా ఆసుపత్రి (గోషా ఆసుపత్రి) వైపు (ప్రోటోకాల్) పి.అర్.ఒ కార్యాలయం నుండి మొదలవుతుంది. సాంస్కృతిక కార్యక్రమం:- సాంస్కృతిక కార్యక్రమములలో భాగంగా నేటి సాయంత్రం 7:00 గంటల నుండి 8.00 గంటల వరకు టి. ఆనంద్ కుమార్, (రాజబాబు) వారిచే మిమిక్రి నిర్వహించుట జరిగినది. ప్రసాదం కౌంటర్:- భక్తుల సౌకర్యార్ధం శ్రీ అమ్మవారి ప్రసాదం భక్తులకు విక్రయించుటకు కౌంటర్లను శ్రీ అమ్మవారి దేవస్థానం పార్కింగ్ ప్రదేశం నందు-2, బురుజుపేట అవుట్ గేట్ వద్ద -2 మరియు కొత్త రోడ్డులో ఒక్కటి ఏర్పాటు చేయడమైనది. POS Machines:- భక్తుల సౌకర్యార్ధం శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులకు నగదు రహిత దర్శన టిక్కెట్లు కొరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ద్వారా పి ఒ ఎస్ మెపీన్లు ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకొవాలని, దేవస్థానం ఏర్పాటు చేసిన కొంటర్ల నందు మాత్రమే దర్శన టిక్కెట్లు కొనుగోలు చేయాలని యాజమాన్యం కోరింది. అమ్మవారి దర్శనానికి వచ్చే వయో వృద్దులకు/ దివ్యాంగులకు/గర్భిణి స్త్రీలకు విజ్ఞప్తి ఎటువంటి అసౌకర్యములు కలుగ కూడదని వృద్ధులు దివ్యాంగులు మరియు గర్భిణి స్త్రీలు గురువారం మినహ మిగతా రోజులలో మద్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల మధ్యలో అమ్మవారి దర్శనము చేసుకొవాలనీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *