

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : బాలికల భద్రత. విద్య, వైద్యం హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని ఏయూ డాక్టర్ దుర్గాబాయ్ దేశముఖ్ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీన్ డైరెక్టర్ ఆచార్య ఎ. పల్లవి అన్నారు. శనివారం ఏయూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని బాలికలకు చిత్రలేఖనం, పోటీలు నిర్వహించి బహుమతి ప్రధానం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది జనవరి 24న భారతదేశంలో జాతీయ బాలికా దినోత్సవం జరుపుతారని ఈ నేపధ్యంలో బాలికలకు ఎదుర్కోనే వివక్ష వంటి సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బాలికలు ఎదుర్కొనే వివక్ష అణచివేత ను నిర్మూలించడానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం బాలికల కోసం బేటీ బచావో బేటీ పడావో సుక్య సమృద్ధి యోజన వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆచార్య నిరూపరాణి మాట్లాడుతూ బాలికలు కుటుంబానికే కాకుండా దేశ అభివృద్ధికి కూడా కీలక పాత్ర పోషిస్తారన్నారు. బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గీతం ప్రొఫెనర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు సమాన అవకాశాలు బాలికలను గౌరవించడం వంటి భవిష్యత్తు కార్యక్రమాలు ప్రధానంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ ముఖ్ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్, స్టాఫ్, ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపల్ జి. సుధారాణి, కోకరస్పాండెంట్ నాగేశ్వరరావు డాక్టర్ రవి. ఉష తదితరులు ఉన్నారు.
