19వ అయిష్ట టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రారంభమైన క్వాలిఫైయింగ్ రౌండ్స్

క్రీడలు

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : 19వ సీఎం ఆర్ అయిష్ట టెన్నిస్ టోర్నమెంట్లో శనివారం 35 ప్లస్ 45 ప్లస్ 55 ప్లస్ 65 ప్లస్ 75 ప్లస్ లో సింగిల్స్ క్యాటగిరిలో క్వాలిఫైయింగ్ మొదటి రౌండ్ మ్యాచులు హోరాహోరీగా జరిగాయి. ఈ మ్యాచ్ లని ఆఫీసర్ క్లబ్, సెంచరీ క్లబ్, మరియు వాల్తేర్ క్లబ్ లో జరిగాయి. క్వాలిఫైయింగ్ రౌండ్ల్ 45 ప్లస్ లో మణిపూర్ కు చెందిన అక్కో జామ్ ఆంధ్రకు చెందిన చైతన్య పై 9-6 తో గెలిచారు అలాగే 45 ప్లస్ లో డాక్టర్ నవీన్, సందీప్ పై 9-2 తో గెలిచారు 65 ప్లస్ లో డాక్టర్ రాంబాబు, పి వి వి శంకర్ రావు పై 9-5 తో గెలిచారు 70 ప్లస్ క్యాటగిరిలో మూర్తి రాజు తెలంగాణకు చెందిన గౌతం పై 9-5 స్కోర్ తో గెలిచారు. రేపటి నుంచి అన్ని క్యాటాగిరిలో డబల్ క్వాలిఫైయింగ్ మ్యాచులు జరుగుతాయి . కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ కే సతీష్ టోర్నమెంట్ సెక్రెటరీ డి ఎస్ఎన్ రాజు, అయిస్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ చంద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *