

విశాఖపట్నం, జనవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ ; వారి అతి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతి రాక సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ముందస్తు పండుగ సంబరాలు శనివారం తేది:10012026న అట్టహసంగా ప్రారంభంఅయ్యాయి. తెలుగు దనం ఉట్టి పడేలా సంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్ధిని, విద్యార్ధులు విశ్వవిద్యాలయ ఆవరణంలో సందడి చేశారు. ఎప్పుడూ జీన్స్ ఫ్యాంట్ వంటి ఆధునిక వస్త్ర ధారణతో కేంపస్‌లో తిరుగాడే విద్యార్ధులు ఒక్కసారిగా పంచెలు, చీరలు, ఓణీలతో తరగతులకు హజరుకావడంతో పాటు గీతం ప్రాంగణంలోని రహదారులపై రంగ వల్లులను తీర్చి దిద్దుతూ సంక్రాంతి శోభను ముందుగానే తీసుకువచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజిలకు చెందిన విద్యార్ధులు రంగోలీ పోటీ, సంప్రదాయ వేషధారణ పోటీలలో సంక్రాంతి సంబరాలకు ఉత్సాహన్ని నింపారు. బోధన, బోధనేతర సబ్బంది సహితం విద్యార్ధులతో కలసి సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. గీతంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధులకు తెలుగు వారి సంప్రదాయాలను తెలియజెప్పడానికి ఈ వేడుకలు ఉపయోగపడతాయని గీతం కేంపస్ లైఫ్ సహయ డీన్ అరుణ్‌కార్తిక్ పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్ధులు నిర్వహించిన కార్యక్రమాలతో గీతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
