
విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ, పీజీ కోర్సుల కళాశాలలో రెండు ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ –స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఈ ఎస్ డి పి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇన్ సోలి్డవర్క్స్ ఫర్ 3డి మోడల్లింగ్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ “స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఆన్ రియల్ టైం అప్లికేషన్స్ యూ సింగ్ ఐఓటీ ఉన్నాయి. ప్రధానాంశాలలో భాగంగా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు ఎంతో అవసరంని ఎం.టెక్, డిప్యూటీ డైరెక్టర్ (ట్రైనింగ్ ఏ పి సి యూ ఏం ఎస్ ఏం ఈ టూల్ రూమ్ – సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సి ఐ టీ డి సాలిడ్ వర్క్స్ ఐ ఒ టీ ఎస్. వెంకట కృష్ణ అన్నారు. ఇటు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై ప్రాక్టికల్ శిక్షణ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అవసరమైన హాజరు తుది అంచనాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయన్నారు.
