

విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 4 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిసాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఈ పోటీలను నిర్వహించారు. చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ గా కన్నూరు యూనివర్సిటీ నిలచింది. ఏయూ పూర్వ ఉపకులపతి, సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్ జి.ఎస్.ఎన్ రాజులు, ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ సంయుక్తంగా కన్నూరు యూనివర్సిటీ క్రీడాకారుడు ముని కృష్ణకి చాంపియన్ ట్రోఫీని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం, సానుకూల దృక్పధం కలిగి ఉండటం ఎతో ప్రధానమన్నారు. నిరంరతం సాధన, క్రమశిక్షణ కలిగి ఉంటే విజయం సాధ్యమవుతుందన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ క్రీడా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరినీ అభినందించారు. ఏయూ క్రీడా సంచాలకులు ఆచార్య ఎన్. విజయ్ మోహన్ మాట్లాడుతూ ఏయూ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించి ఏఐయూకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో సమన్వయం, సమిష్టి కృష్టితో కార్యక్రం విజయం అందిందన్నారు. న్యాయ నిర్ణేతలు, కోచ్లు, టీం మేనేజర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా విశ్వవిద్యాలకు అందించే అల్రౌండ్ చాంపియన్షిప్ విభాగంలో మెదటి స్థానాన్ని మేంగళూరు విశ్వవిద్యాలయం, కన్నూరు యూనివర్సిటీలు సంయుక్తంగా, రెండో స్థానాని తేజ్ బహుదూర్ సింఘ్ యూనివర్సిటీ, మూడవ స్థానాన్ని ముంబాయి యూనివర్సిటీ, సావిత్రభాయి ఫూలే విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా సాధించాయి. వీరికి ట్రోఫీలను ప్రధానం చేసి అభినందించారు. ఏఐయూ అబ్జర్వర్ డాక్టర్ కౌకబ్ అజీమ్, ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్, క్రీడా విభాగాధిపతి ఆచార్య ఏ.పల్లవి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు,ఆచార్య జాలాది రవి, ఏయూ విశ్రాంత బాడిబిల్డింగ్ కోచ్ డాక్టర్ ఆర్.వి.ఎన్ రత్నాకర్, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె.గురునాధ రావు, ఐ బి బి ఎఫ్ జడ్జి జోగా కిరణ్,సెక్రటరీ డాక్టర్ వై శ్రీనివాసరావు, ప్రొఫెసర్ ఆశా ఇ మ్మానియాల్ రాజ్, ప్రొఫెసర్ ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్శిటీల నుంచి 155 మంది జట్టు మేనేజర్స్, కోచ్ లు,509 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఎనిమిది విభాగాలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలచిన వారికి పతకాలను అందించారు. అనంతరం ప్రధమ స్థానంలో నిచి బంగారు పతకాలు సాధించిన వారి నుంచి చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ను ఎంపిక చేశారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ గా కన్నూర్ యూనివర్సిటీ మునికృష్ణ నిల్చారు. ఓవరల్ ఛాంపియన్ గా మంగుళూరు యూనివర్సి, కన్నూర్ యూనివర్సిటీ జాయింట్ విన్నర్స్ గా నిల్చారు. రెండడవ స్థానాన్ని తేజ్ బహూదుర్ యూనివర్సిటీ, మూడవ స్థానం సావిత్రి బాయి పూలే యూనివర్సిటి విజేతగా నిలిచారు. 60కిలోల విభాగంలలో గోల్డ్ మెడల్ కోయం బత్తూర్ భారతీయర్ యూనివర్సిటీ ఎం కారికేయన్, సిల్వర్ మెడల్ యూనివర్సిటీ ఆఫ్ ముంబాయి పి. ప్రసాద్, బ్రాంజ్ మెడల్ సాయిత్రి బాయి పూలే యూనివర్సిటీ జి. జయనితిన్ సాధించారు. 65కిలొ ల విభాగంలో గోల్డ్ మెడల్ సావిత్రి బాయి పూలే యూనివర్సిటీ బి.పాండు రంగయువరాజ్. సిల్వర్ మెడల్ అన్నాయూనివర్సిటీ ఎం విఘ్నేష్. బ్రాంజ్ మెడల్ సత్య బాలాజీ ఆంధ్రాయూనివర్సిటి సాధించారు. 70 కిలోల విభాగంలో జాన్ పూర్ వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్, అశిష్ కుమార్, సిల్వర్ మెడల్ మంగళూరు యూనివర్సిటీ ప్రధమ్, బ్రాంజ్ మెడల్ కువెంపు యూనివర్సిటీ జీఎం పి లోకేష్ నిల్చారు. 75 కిలోల విభాగంలో చెన్నై జెప్పియర్ యూనివర్సిటీ గొ ల్డ్ మెడల్ ఎం మణిశర్మ, సిల్వర్ మెడల్ అర్జున్ మంగళే సంజయ్ ఘేదవత్ యూనివర్సిటీ, బ్రాంజ్ మెడల్ కౌలాలంపూర్ శివాజీ యూనివర్సిటీ జె. మయర్ మరాత్ నిల్చారు. 80 కిలోలో విభాగంలో కన్నూర్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఎన్ఎం కృష్ణ, యూనివర్సిటీ ఆఫ్ ముంబాయి సిల్వర్ మెడల్ జి. గవరే, కేరళ విశ్వవి ద్యాలయం పి.యు వైశాఖ్ నిల్చారు. 85 కిలోల విభాగంలో వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ సూరత్ గోల్డ్ మెడల్ తివారీ సూరజ్, కన్నూర్ యూనివర్సిటీ సిల్వర్ మెడల్ ఎన్ అభయ్, యూనివర్సిటీ ఆ ఫ్ మద్రాస్ బ్రాంజ్ మెడల్ ఎం. తరుణ్ సాదించారు. 90 కిలోల విభాగంలో మంగుళూర్ యూనివర్సిటి గోల్డ్ మెడల్ కిషన్ శెట్టి. రాణి చెన్నమాంబ యూనివర్సిటీ సిల్వర్ మెడల్ మహ్మద్ షాకీబ్, ఆంధ్రాయూనివర్సిటీ బ్రాంజ్ మెడల్ వి. జగదీష్ నిల్చారు. 90 ప్లస్ విభాగంలో గురు గ్రామ్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సౌరవ్ వశిష్ట, వెస్ బెంగాల్ స్టేట్ యూనివర్సిటీ సిల్వర్ మెడల్ బి.షా. యూనివర్సిటీ ఆఫ్ కేరళ బ్రాంజ్ మెడల్ టి.కె.షనిష్ నిల్చారు.







