మార్చి 28,29 తేదీలలో పరీక్షలు

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపి సెట్-2025 బ్రోచర్ను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 28,29 తేదీలలో ఏపీసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఏపీసెట్ ప్రవేశ పరీక్షకు అర్హత కలిగిన అభ్యర్థులు సత్వరం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని మెంబర్ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు తెలిపారు. జనరల్ విభాగంలో రూ.16వందలు, బి.సి,ఈడబల్యూఎస్ విభాగాలలో రూ 13వందలు ఎస్.సి, ఎస్టీ, పిడబల్యూడి, ఇతరులు రూ.9వందలు దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. పూర్తి ఆంధ్రాయూనివర్సిటీ.ఈడి యూ డాట్ ఇన్ ఏ పి ఎస్ ఈ ట్ డాట్ నెట్ డాట్ ఏపీ సెట్లో మెత్తం 30 సబ్జెక్టులలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 9వ తేదీ వరకు స్వీకరిస్తారు. రూ. 2 వేలు అపరాధ రుసుముతో ఫిబ్రవరి 25వ తేదీ వరకు, రూ 5 వేలు అపరాధ రుసుముతో దరఖాస్తులను మార్చి 5వ తేదీ వరకు స్వీకరిస్తారు. హాల్ టికెట్లను మార్చి 19వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చను. నూతనంగా ఆవిష్కరించిన బ్రోచర్ను వెబ్సైట్లో ఉంచనున్నారు. దీనిలో పరీక్ష విధానం, పరీక్ష అర్హతలు, రిజర్వేషన్ విధానాలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు రుసుములు, పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డు, ఆన్సర్ కీ, ఫలితాలు, సర్టిఫికేషన్ తదితర అంశాలను దీనిలో సవివరంగా పొందుపరిచారు. దరఖాస్తు చేసే వారికి అవసరమైన సమాచారం సమగ్రంగా ఈ బ్రోచర్లో పొందుపరిచారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, ఏపీసెట్ స్టీరింగ్ కమిటి మెంబర్ ఆచార్య కె. రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏయూ పురుషులు, మహిళల హాకీ జట్టు ఎంపిక


విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం పురుషుల, మహిళల, హాకీ జట్టు ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్, డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఎ. పల్లవి హాకీ క్రీడాకారులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ పురుషుల, మహిళలు హాకీ జట్టు సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్శిటి పోటీల్లో ఆంధ్రాయూనివర్శిటి తరపున పాల్గొంటారని తెలిపారు. పురుషుల హాకీ పోటీలు జనవరి13 నుంచి 19 వరకు చెన్నై సత్యభామ యూనివర్శిటిలో జరుగుతాయని, మహిళలు హాకీ పోటీలు జనవరి 15 నుంచి 19 వరకు చెన్నై సత్యభామ యూనివర్శిటిలో జరగుతాయన్నారు. పురుషుల జట్టుకు హాకీ కోచ్ గా చిన్నప్పారావు, మేనేజర్ గా కె. దుర్గారావు, మహిళల హాకీ కోచ్ గాఎం. వసంతి వ్యవహరిస్తారన్నారు.
