
విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 7 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: విశాఖ నగరంలోని తెలుగుదేశం కార్యాలయం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేష్ బాబు ని బ్రహ్మకుమారి మీడియా వింగ్ కో-ఆర్డినేటర్ రామేశ్వరి బుధవారం నూతన సంవత్సర , సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి విజయ తిలకము దిద్ది అభినందించారు. తాము తమ సంస్థ ద్వారా సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక మ్యూజియం కోసం , ఒక ప్రాథమిక చికిత్స ఆలయం కోసం గతంలో వినతిపత్రం ఇచ్చినట్లు గుర్తుచేస్తూ మరలా ఇప్పుడు ఒక వినతి పత్రాన్ని సవినయంగా సోదర రామేశ్వరీ కలసి సవినయంగా వినతిపత్రాన్ని సమర్పిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ ( ముఖ్య కేంద్రం మౌంట్ అబూ రాజస్థాన్ ) అని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని అన్ని సేవా కేంద్రాల వారు కలిపి వ్రాయుచున్న విన్నపము. తాము గత రెండున్నర సంవత్సరాల నుండి సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి రెండు వినతి పత్రములు సమర్పించడం జరిగిందన్నారు. మీ దివ్య సన్ముఖమునకు , పార్లమెంట్ సభ్యుడు ముతుకు మిల్లి శ్రీ భరత్ కి కూడా అందజేయడం జరిగిందని తెలిపారు . తమ సంస్థ తరఫు నుండి ఒక ఆధ్యాత్మిక మ్యూజియమును భక్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు అన్ని వర్గాల వారికి జ్ఞాన విజ్ఞాన వికాసములు కలిగించేందుకు ఒక ఆధ్యాత్మిక సంగ్రహాలయాన్ని సింహాచలo పరిసర ప్రాంతాల్లో నిర్మించాలని సంకల్పించాము అని పేర్కొన్నారు. తదనగుణంగా రాష్ట్ర ప్రభుత్వము వారిని లేఖల ద్వారా అభ్యర్థించడం జరిగింది. సింహాచల ఎండోమెంట్ భూములలో వీలు కాదని పరిసర ప్రాంతాల్లో కూడా రికార్డు లేని భూములు పంచ గ్రామ సమస్యలు ఉన్నాయని తెలిసికొన్నాము. తదనంతరం పెందుర్తి మండలం ఎమ్మార్వో గారిని కలిసి అడివి వరం నుండి శోంట్యం వెళ్లే దారిలోదారిలో ఎస్ఆర్ పురం, లేదా దార పాలెం ప్రభుత్వ భూములు వారి ఆధ్వర్యంలో ఉన్నట్లు తెలిసిందన్నారు. అదే ప్రాంతంలో భైరవకోన ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూములు కూడా విశాఖ రూరల్ ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఉన్నట్లు తెలిసిందన్నారు. తమరు మాకు ఎస్ఆర్ పురం లేదా భైరవకోన , లేదా దారపాలెం లో ఉన్న ప్రభుత్వ భూములలో 50 సెంట్లు కేటాయించినట్లయితే సమాజ శ్రేయస్సు కొరకు తాము నిర్మించే ఈ ఆధ్యాత్మిక మ్యూజియం ప్రాథమిక చికిత్స ఆలయముల ద్వారా ఆధ్యాత్మిక సామాజిక సేవలను ఉచితముగా అందించగలుగుతామని మనవి చేసుకుంటున్నాము. మీరు మా సంస్థకు ఈ స్థలాన్ని సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని కేటాయించగలరని అభ్యర్థిస్తున్నాము. ఇంత క్రితం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి , విశాఖపట్నం జిల్లా కలెక్టర్, ఎంపీ భరత్ కి అందజేసిన వినతి పత్రం యొక్క కాపీని మీకు జత చేయడం జరిగిందని ఆమె వివరించారు.
