
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 31 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం 2025 సంవత్సరంలో ఎన్నో నూతన మైలురాళ్లను చేరుకుంది .12 నెలల కాలంలో సాధించిన నిర్వహించిన పలు కార్యక్రమాలలో భాగంగా ఫిబ్రవరి నెలలో 18వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య జి.పి రాజశేఖర్ నియమితులయ్యారు. ఐఐటి ఖరగ్ పూర్ గణితశాస్త్ర ఆచార్యులైన, విశాఖవాసి ఆచార్య రాజశేఖర్ ను నూతన ఉపకులపతిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో మరొక నూతన అధ్యాయం ప్రారంభమైంది ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బీచ్ రోడ్లను ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో శతాబ్ది లోగోను శతాబ్ది సంవత్సరంలో విశ్వవిద్యాలయ విజన్ డాక్యుమెంటెలను ఏ.యూ విసి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కు ఏ యూ ఫీజికల్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్. విజయమోహన్, హెడ్ ప్రొఫెసర్ ఏ పల్లవి ఈ కార్యక్రమం కృషి కి వి సి ప్రొఫెసర్ రాజశేఖర్ అభినందనలు తెలిపారు. మార్చి 15వ తేదీన నూతన ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (బెంగళూరు) అధిపతి ఆచార్య బి.ఎస్ దయాసాగర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వి సి ఆచార్య జి.పి రాజశేఖర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు- ఏప్రిల్ 26 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల ప్రారంభ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్ లోని ఏ.యూ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. మధు మూర్తి పాల్గొన్నారు. జులై 11 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా విభిన్న రంగాలకు చెందిన నిపుణులతో విశ్వవిద్యాలయ విద్యార్థులను అనుసంధానం చేసే శతాబ్ది వాణి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అకడమిక్ సెనేట్ మందిరంలో ఈ కార్యక్రమాలను ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ప్రారంభించారు. అనంతరం తొలి ప్రసంగాన్ని జియో ఫిజిక్స్ విభాగంలో పరిశోధకులకు అందించారు. జులై 26 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా అధ్యయన కేంద్రం, సిఐఐ ఇండియన్ విమెన్ నెట్వర్క్ సంయుక్తంగా విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పాలిసీస్, ప్రాసెసెస్ ఫర్ ఇంక్లూషన్ అంశంపై నిర్వహించిన సదస్సును ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రారంభించి ప్రసంగించారు .ఆగష్టు 7 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఎండోమెంట్ లెక్చర్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు భోపాల్లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్ “చట్టం, సామాజిక క్రమం & రాజ్యాంగ దృక్పథాలు” అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. కాన్షియస్నెస్ తో జీవనం సాగించడం, దీన్ని కాపాడుకోవడానికి చట్టం అవసరమని అన్నారు. రాజ్యాంగం ప్రజలందరినీ ఐక్యం చేస్తుందని రాజ్యాంగ రచించిన విధానాన్ని ప్రత్యేకతలను వివరించారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆగష్టు 12 వ తేదీన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాకారం చేసే దిశగా యువత కృషి చేయాలని యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఇండియా–భూటాన్ డైరెక్టర్ డ్రైన్ ఫారంట్ అన్నారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ.యూ ఎకనామిక్స్ విభాగంలో నిర్వహించిన ఇంటర్ ఫెయిల్ డైలాగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏయు ఎకనామిక్స్ విభాగం, ఆగ్రో ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్, ఎస్ వుయ్ కెన్ సంస్థ, కింగ్స్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం హైదరాబాద్ శాఖ, వుయ్ ద పీపుల్ ఇండియా ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించాయి. ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు .ఆగష్టు 28 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్ ఇన్సైట్స్ ఫర్ అకడమిషన్స్ కాన్సెప్ట్స్, అప్లికేషన్స్ అండ్ టూల్స్ అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈరోజు ప్రారంభమైంది. ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం సమావేశం మందిరంలో కార్యక్రమాన్ని టిసిఎస్ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ సెల్ అధిపతి సి.వి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న శాస్త్రాలకు చెందిన నిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధు మూర్తి వర్చువల్ విధానంలో ఎఫ్.డి.పి ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు.సెప్టెంబర్ 4 వ తేదీన ఆవిష్కరణల దిశగా పనిచేయాలని భట్నాగర్ అవార్డు గ్రహీత, ఐఐటి హైదరాబాద్ పూర్వ సంచాలకులు జి.నరహరి శాస్త్రి అన్నారు. ఏయూ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ జి.నాగేశ్వర రావు ఎండోమెంట్ లెక్చర్లో భాగంగా క్వాంటిఫైయింగ్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ – దెయిర్ ఇంపాక్ట్ ఇన్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో రసాయన శాస్త్రం, బయాలజీ, ఏఐ టెక్నాలజీలను మిళితం చేస్తూ జరుగుతున్న పరిశోధనలను వివరించారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, మాజీ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు, విభాగాధిపతి ఆచార్య శ్యామల తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5 వ తేదీనఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతరత్న, భారత పూర్వ రాష్ట్రపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కి ఘన నివాళులు అర్పిస్తూ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏ.ఎస్.టి.సి-హైదరాబాద్) తో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ ఫర్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్-2047 అనే అంశంపై ఈ కాంక్లేవ్ కార్యక్రమం బీచ్ రోడ్ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (కలకత్తా) సంచాలకులు ఆచార్య సంఘమిత్ర బందోపాధ్యాయ హాజరయ్యారు. . ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు.- సెప్టెంబర్ 8 వ తేదీన వికసిత్ భారత్ సాకారం కావడంలో విద్య కీలకంగా నిలుస్తుందని ఐఐఐటి అగర్తల పూర్వసంచాలకులు ఆచార్య పి.ఎస్ అవధాని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా బీచ్ రోడ్ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం- 2025 ను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏఐ సాంకేతికతతో అనేక సమస్యలకు పరిష్కారాలను పొందడం సాధ్యపడుతుందని అన్నారు. అదే సమయంలో మానవునిలో సృజనాత్మక శక్తి లోపిస్తోందని చెప్పారు. అక్షరాస్యత సాంస్కృతిక విలువలను వృద్ధి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. సెప్టెంబర్ 15 వ తేదీన సాంకేతిక పరిజ్ఞానం కొరకు విదేశాలపై ఆధారపడకుండా, దేశీయంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐఐటి మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు, భట్నాగర్ అవార్డు గ్రహీత గంటి రాధాకృష్ణ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో నిర్వహించిన డాక్టర్ ఆర్.విజయశాంతి స్మారక ఉపన్యాసంలో ఆయన భారత దేశంలో 5 జి టెక్నాలజీ అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. సెప్టెంబర్ 23 వ తేదీన శతాబ్ద చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయ చారిత్రక వికాసాన్ని గ్రంథస్తం చేయాలని కేంద్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ పబ్లిక్ గ్రీవెన్స్ విభాగం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి.శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఏయూ ఆచార్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వి. శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్ దృష్టి తో ముందుకు సాగాలని సూచించారు. చరిత్రకారులు, విశిష్ట ఆచార్యులతో సంప్రదించి ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రగతి, వికాసాలను ఒక గ్రంథస్థంగా తీసుకువస్తే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. అదే విధంగా విశ్వవిద్యాలయాన్ని రానున్న 50 సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ దిశగా నడిపించాలి అనే అంశాలపై ఒక విజన్ ను కలిగి ఉండాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి ప్రభుత్వ, ప్రైవేటు రంగం సహకారం అందిస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు- సెప్టెంబర్ 24 వ తేదీన ఆధునిక భారతదేశంలో తత్వశాస్త్ర కోవిదులలో ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి ది ప్రత్యేక స్థానం అని ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ ఆచార్య కంభంపాటి హరిబాబు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ మందిరంలో ఏయూ తత్వశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐ సి పి ఆర్ అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఎక్స్‌ప్లోరింగ్ ద ఫిలసాఫికల్ లెగసి ఆఫ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి అనే అంశంపై మూడు రోజులు ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు- సెప్టెంబర్ 25 వ తేదీన ముందస్తు సన్నద్ధతతో భూకంప ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించడం సాధ్యపడుతుందని ఐఐటి ఖరగ్పూర్ జియాలజీ జియో ఫిజిక్స్ విభాగం ఆచార్యులు విలియం కుమార్ మహంతి అన్నారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఆయన రసాయన శాస్త్ర విభాగ సమావేశం మందిరంలో విద్యార్థులను ఉద్దేశించి భూకంప ప్రమాదాలు సంబంధిత పరిశోధనలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. అక్టోబర్ 11 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె. రామస్వామి చిత్రపటాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవిష్కరించారు. అదేవిధంగా గతంలో జస్టిస్ కె.రామస్వామి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పబ్లిక్ పవర్ అండ్ జ్యూడిషియల్ ఫంక్షన్ అనే అంశంపై అందించిన ప్రసంగాన్ని పునర్ ముద్రించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ మహోన్నత వ్యక్తిత్వం జస్టిస్ కె.రామస్వామి సొంతమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. అక్టోబర్ 17 వ తేదీన సాంకేతిక రంగంలో స్వయం సంవృద్ధి సాధించాలని, స్వదేశీ సాంకేతిక ప్రగతి శరవేగంగా జరుగుతోందని డి.ఆర్.డి.ఓ డైరెక్టర్ జనరల్(ఎన్.ఎస్ ఎం డాక్టర్ ఆర్.వి. హర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎన్.ఎస్.టి.ఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అకడమిక్ కాన్ఫరెన్స్- 2025 ను అయన ఏ.యూ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ వి.హర ప్రసాద్ మాట్లాడుతూ భారత్ నవతరం, భవిష్యత్ సాంకేతికతలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా డ్రోన్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. అక్టోబర్ 24 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న శతాబ్ది క్రికెట్ టోర్నమెంట్ 2025- 26 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సూపర్ ఓవర్ మ్యాచ్లో విజేతగా గాయత్రీ విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల ఋషికొండ జట్టు నిలిచింది. రన్నర్ గా వి.మాడుగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు నిలిచింది. ఈ పోటీలకు మొత్తం 75 జట్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి 55 జట్లు హాజరయ్యాయి. ఈ జట్ల నుంచి లక్కీ డిప్ ద్వారా రెండు జట్లను ఎంపిక చేశారు.ఈ రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. విజేతగా నిలిచిన గాయత్రి విద్యా పరిషత్ కళాశాల జట్టుకు 50వేల రూపాయల నగదు పురస్కారాన్ని, ట్రోఫీని ప్రధానం చేశారు. రన్నర్ గా నిలిచిన వి.మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుకు 30 వేల రూపాయల నగదు బహుమతిని, మెమెంటోను ప్రధానం చేశారు. క్రికెట్ టోర్నమెంట్ని ఏయూ క్రీడా విభాగం పూర్వ సంచాలకులు పి.ఆర్ నారాయణస్వామి, ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తో కలిసి ప్రారంభించారు. అక్టోబర్ 27 వ తేదీన ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ట్రాన్స్లేషనల్ మెడిసిన్ ఇన్ క్యాన్సర్ టి.ఎం.సి- 2025 జాతీయ సదస్సు జరిగింది. ఏయూ టి.ఎల్.ఎన్ సభామందిరంలో సదస్సును వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ పార్క్ సీఈఓ డాక్టర్ ఎం.కులకర్ణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్లాడుతూ ఒక ఆలోచన పూర్తిస్థాయిలో వ్యాధులను నయం చేయలేదని అన్నారు. ఒక ఆలోచనను ఔషధంగా తయారు చేయడానికి మధ్యలో అనేక అంశాలు ముడిపడి ఉంటాయని చెప్పారు, ట్రాన్స్లేషనల్ అంకాలజీ ప్రాముఖ్యతను వివరించారు. అక్టోబర్ 27 వ తేదీన వ్యర్ధాల ఉత్పత్తిని వీలైనంతవరకు నియంత్రించాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి డైరెక్టర్ ఎం ఎం గంగేర్కర్ అన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పర్యావరణ శాస్త్ర విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని ప్లాటినం జూబ్లీ సమావేశం మందిరంలో నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ఆయన ప్రారంభించారు. ఎంపవరింగ్ ఎన్విరాన్మెంటల్ స్టీవర్డ్షిప్(ఈఈఎస్)-2025 (సస్టైనులిటీ ఏజ్ టూల్ ఫర్ రిస్క్ రిడక్షన్) అంశంపై ఈ ఎఫ్.డి.పి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య గంగేర్కర్ మాట్లాడుతూ ఉష్ణోగ్రతల పెరుగుదల సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమవుతున్నాయనే విషయం గ్రహించాలన్నారు. జీవవైవిధ్యత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భూగోళం మనది, భవిష్యత్ తరాలది అనే ఆలోచనలో ప్రతీ వ్యక్తి నచడుకోవాలని సూచించారు. నవంబర్ 03 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కెరియర్ ప్లానింగ్ డెవలప్మెంట్ సెంటర్ (సిడిపిసి) ని ప్రారంభించారు. బీచ్ రోడ్ లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ సిడిపిసి కు సంబంధించిన వివరాలతో కూడిన బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆచార్యులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఉద్యోగాల కల్పనలో ప్రాథమిక అంశాలలో పటిష్టమైన జ్ఞానం కలిగి ఉండటం ఎంతో కీలకంగా నిలుస్తుందని చెప్పారు. నవంబర్ 07 వ తేదీన ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నా విభాగం-నా కుటుంబం అనే నినాదంతో నూతనంగా శుక్రవారం సాయంత్రం సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రారంభించిన “సంధ్య” కార్యక్రమం విశ్వవిద్యాలయంలో ఒక నూతన ఒరవడికి నాంది పలికింది. విభాగ విద్యార్థులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది మధ్య మరింత సత్సంబంధాలు పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసారు- నవంబర్ 11 వ తేదీన ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా చేపడుతున్న గ్రామీణ అనుసంధానం కార్యక్రమాన్ని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్, అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాడేరు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉద్దేశించి “గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు” అనే అంశంపై ప్రసంగించారు. ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలను స్థిరపరచుకుని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పాఠ్యపుస్తకాన్ని పఠించడం, సొంతంగా నోట్స్ తయారుచేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. మాతృభాషలో విద్యను అభ్యశించడంతో పాటు, ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా విద్యార్థులు నిరంతరం సాధన చేయాలని సూచించారు. ఉన్నత విద్యలో బాలికల సంఖ్య తక్కువగా ఉంటోందని, దీనిని నివారించడానికి తల్లదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ధిక పరిస్థితులు, అవగాహన లేమి, అవకాశాలపై తగిన అవగాహన లేకపోవడం వలన ఉన్నత విద్యలో తక్కువ శాతం మంది వస్తున్నారని, ఈ విధానంలో మార్పు రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవంబర్ 18 వ తేదీన మహిళ భద్రతకు ప్రజలంతా కలిసి పనిచేయాలి. మహిళల భద్రత కల్పన కేవలం ఒక వ్యక్తిపైన, వ్యవస్థపైన ఆధారపడి ఉండదని, వారి భద్రతకోసం అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఏయూలో సస్టైనింగ్ విమెన్ సేఫ్టీ – బెంచ్మార్కింగ్ విశాఖపట్నంమ్స్ సక్సస్ అండ్ ఫ్యూచర్-ప్రూఫింగ్ గవర్నెన్స్ అంశంపై రాష్ట్ర మహిళా కమీషన్, ఏయూ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మహిళా భద్రతపై నిర్వహించిన నారీ 2025 ఇండెక్స్లో జాతీయ స్థాయిలో విశాఖ నగరం ప్రధమ స్థానంలో నిలచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.నవంబర్ 20 వ తేదీన ఐకమత్యం సమైక్యత లక్షణాలను యువతలో పెంపొందించే విధంగా ఎన్.సి.సి పనిచేస్తోందని ఎన్.సి.సి డిప్యూటి డైరెక్టర్ జనరల్(ఏపి-తెలంగాణ) ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలాని అన్నారు. ఏయూ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఎన్సిసి దినోత్సవ వేడుకలు, ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రక్తదానం చేస్తున్న విద్యార్థులను అభినందించి, అనంతరం వారితో మాట్లాడారు. యువత సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో పనిచేయాలని సూచించారు. ఎన్.సి.సి 77వ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఏక కాలంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం ప్రత్యేక ప్రదర్శన, విద్యార్థులకు రక్షణ రంగాల ఉద్యోగాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వారిలో మరింత స్ఫూర్తిని నింపుతాయన్నారు. రక్తదానం పట్ల విస్తృత అవగాహన పెంచాలన్నారు. క్రమశిక్షణతో పాటు విద్యార్థులలో సామాజిక సేవ దిశగా వారి ఆలోచనలు పెంచడానికి కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు. డిసెంబర్ 05 వ తేదీన పుడమి తల్లిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ వ్యక్తిపైన ఉందని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఏయూ శతాబ్ధి ఉత్సవాలు, పర్యావరణ శాస్త్ర విభాగం డైమండ్ జూబ్లీ సంవత్సారలను పురస్కరించుకుని బీచ్‌రోడ్డులో వరల్డ్ సాయిల్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ నేల సారాన్ని పెంచుకోవడం, సంరక్షించుకోవడం ఎంతో ప్రధానమన్నారు. మానవ జీవనం, మనుగడ నేలతో ముడిపడి ఉందనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతో ప్రధానమన్నారు. మనిషి యాంత్రికంగా మారిపోయి, పర్యవసానాలను గుర్తించడం లేదు అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన రూపకం, పాటలు ఎంతో ఆలోచింప చేస్తున్నాయన్నారు. మట్టిని ఆధారంగా చేసుకుని ఆనేక జీవులు మనుగడ సాగించేవని, నేడు అవన్నీ కనుమరుగైపోతున్నాయన్నారు. మానవుడు తమ స్వార్ధాన్ని విడిచిపెట్టి పుడమి పరిరక్షణకు నడుబిగించాలన్నారు. డిసెంబర్ 06 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం హ్యూమన్ జెనెటిక్స్ విభాగం, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ సి ఎస్ ఎస్ ఐ సహకారంతో భిన్న సామర్థ్యం గల వ్యక్తులు (దివ్యాంగులు) ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడానికి మైత్రి వాక్ 2.0 వాకథాన్‌ను నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజ శేఖర్ ఈ వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. తన ప్రసంగంలో, ప్రొఫెసర్ రాజ శేఖర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎదుర్కొంటున్న వివక్షను రూపు మాపడం, వారిని సమాజంలో భాగంగా చేయడం ఎంతో అవసరమన్నారు. వారు దశావతారం కార్యక్రమాన్ని ప్రదర్శించిన విధానం ఎంతో ముచ్చట గొలిపిందన్నారు. వారిని సమాజంలో భాగం చేసే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. దివ్యాంగులను సామాజిక సమ్మిళితం చేస్తూ వారి సాధికారతకు కృషి చేయాలని సూచించారు. డిసెంబర్ 13 వ తేదీన విద్యను అందించే దేవాలయం విశ్వవిద్యాలయం. దీనిని నిర్మాణానికి ఎందరో త్యాగాలు చేసారు. వారి త్యాగాలలను గుర్తుచేకుంటూ మీ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్ పర్సన్, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సుధామూర్తి అన్నారు.
ప్రొఫెసర్ బెన్నీ హెడ్ ఇంగ్లీషు విభాగం. అసోసియేట్ డీన్, ఔట్రీచ్, బ్రాండింగ్ అండ్ మీడియా ఏయూ
పి ఆర్ ఒ డాక్టర్ నర్శింహాం
