
విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 1 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : గాయత్రీ విద్యా పరిషత్ లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు సంస్థ యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్రైవ్ లో టాటా ఎలక్ట్రా న్రిక్స్, బెంగళూరు, ఫ్లెక్మానిక్స్, చెన్నై, మదర్సన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై అనే మూడు బహుళజాతి కంపెనీలు పాల్గొని మొత్తం 220 మంది విద్యార్ధులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-ప్లేస్మెంట్ టాక్ లో కంపెనీల హెచార్ ప్రతి నిధులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వై. రామ్మోహన రావు,అసోసియేట్ డైరెక్టర్,కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కంపిటెన్సీస్ సి ఎస్ ఈ ఇండియా మాట్లాడుతూ టాటా ఎలక్ట్రానిక్స్ బెంగళూరులో ఐఫోన్ అసెంబ్లీ యు నిర్వహిస్తోందని, అక్కడ ముఖ్యంగా మహిళా అభ్య ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పిఎఫ్ వసతి సదుపాయం, ఇతర అలవెన్సులు జీతంతో పాటు అందిస్తుందని తెలిపారు. టాటా సంస్థ భారతదేశ గర్వకారణం అత్యంత కీలకమై బ్రాండ్ కావడంతో విద్యార్థులకు మంచి అభివృద్ధి కి అవకాశాలు వుంటాయని పేర్కొన్నారు. శ్రీ విద్యా సాగర్ ఎం.,ఏజీఎం – హెచ్ఆర్ (మానవ వనరులు), కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కంపిటెన్సీస్ సి ఎస్ ఈ ఇండియా మాట్లాడుతూ ఫ్లెకానిక్స్, ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ మదర్సన్ కంపెనీ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తయారీ గామిగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవనీయులు డి. దక్షిణామూర్తి గారు వైస్ ప్రెసిడెంట్ గాయత్రి విద్యా పరిషత్ అధ్యాపకులు మరియు సిబ్బంది ఎంపికైన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఆచార్య పి.రాజగణపతి గారు మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పట్టుదలతో పాటు కళాశాల అందించిన నాణ్యమైన విద్య ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. గాయత్రి విద్యా పరిషత్ సభ్యులు,కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.ఎస్ బోస్, ప్లేస్మెంట్ అధికారి ఆచార్య సరిత, యూజీ డైరెక్టర్ శ్రీ డి.గిరిధర్,తో పాటు అధ్యాపకులు మరియు సిబ్బంది ఎంపికైన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్లను సమర్థవంతంగా నిర్వహించిన ప్లేస్మెంట్ విభాగం మరియు ప్లేస్మెంట్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఉత్తమ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ ప్లేస్మెంట్ విజయాలు కళాశాల ఖ్యాతిని మరింత పెంచడమే కాకుండా, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కళాశాల అధికారులు అభిప్రాయపడ్డారు.
