విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 20 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేధికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి టేబుల్‌టెన్నిస్(టి.టి) పోటీలలో గీతం విద్యార్ధులు విశాఖ జట్టు తరపున పాల్గొని ప్రతిభను చాటారు. ఈ పోటీలలో పురుషులు సింగిల్స్ విభాగంలో ప్రధమ స్థానం సాధించిన విశాఖ జట్టులో గీతం విద్యార్ధులు కుశాల్ దాస్, సూర్య, రోహిత్ హల్‌దర్ ప్రతిభను కనబరిచి పతకాలు అందుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో పి.హసని కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా గీతం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, శాప్ డైరక్టర్ ఎండి రమేష్‌కుమార్, జివిఎమ్‌సి స్పోర్ట్స్ డైరక్టర్ ఇ.అప్పలరాజు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గీతం అసిస్టెంట్ డీన్ అరుణ్‌కార్తిక్, ఏపి టేబుల్ టెన్నిస్ సంఘం సంయుక్త కార్యదర్శి బి.శ్రీనివాస్, జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డి.వి.ఎస్.వై.శర్మ, వివిధ జిల్లా క్రిడాకారులు, కోచ్‌లు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

