సమాజానికి సేవ చేయాలనే ఆలోచన యువత కలిగి ఉండాలి.

ఎడ్యుకేషన్

విశాఖఎడ్యుకేషన్, నవంబర్ 20 : ఐకమత్యం సమైక్యత లక్షణాలను యువతలో పెంపొందించే విధంగా ఎస్సీసి పనిచేస్తోందని ఎన్.సి.సి డిప్యూటి డైరెక్టర్ జనరల్ (ఏపీ-తెలంగాణ) ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలాని అన్నారు. గురువారం ఏయూ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఎన్ సిసి దినోత్సవ వేడుకలు, ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రక్తదానం చేస్తున్న విద్యార్థులను అభినందించి, అనంతరం వారితో మాట్లాడారు. యువత సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ప నిచేయాలని సూచించారు. ఎన్.సి.సి 77వ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఏక కాలంలో నిర్వహించడం జరుగుతోంద. న్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం ప్రత్యేక ప్రదర్శన, విద్యార్ధులకు రక్షణ రంగాల ఉద్యోగాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వారిలో మరింత స్ఫూర్తిని నింపుతాయ న్నారు. రక్తదానం పట్ల విస్తృత అవగాహన పెంచాలన్నారు. క్రమశిక్షణతో పాటు విద్యార్థులలో సామాజిక సేవ దిశగా వారి ఆలోచనలు పెంచడానికి కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు. యువత సృజనాత్మక ఆలోచనలు, దేశంకోసం పనిచేయాలనే తపమ ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయన్నారు.
రక్తదానం చేయడం అత్యుత్తము మానవతా సేవ చేయడంతో సమానమని ఆంధ్రవిశ్వవిద్యాల యం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. విద్యార్థులు చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను రక్షిస్తుందన్నారు. నిబద్ధతతో యువతను ధైర్యంగా దేశం కోసం నడిపించే బాధ్యత ను ఎన్.సి.సి సమర్ధవంతంగా నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్ తరాలకు మీ అనుభవాలను పందాలని చెప్పారు. విపత్తులు సంభవించిన సమయంలో ఎన్.డి. ఆర్.ఎఫ్. ఎన్.సి.సి కేడెట్లు అందించే సేవలను అభినందనీయమన్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ సేవలు, ఎస్.ఎస్.బి మోటివేష సీ గైడెన్స్, పోస్టర్ ప్రిపరేషన్ పోటీలు మరింత ఉత్సాహాన్ని విద్యార్థులతో నింపాయన్నారు. యువతను భవిష్యత్ సవాళ్లను ప్రేరణ కలిగించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోస్టర్ తయారీ, స్లోగన్ రైటింగ్ పోటీల విజేతలకు బ హుమతులను ప్రధానం చేశారు. ఎన్ సిసి కాడెట్లతో పాటు పలువురు ఏయూ విద్యార్ధులు, విదేశీ విద్యార్థులు రక్తదానం చేశారు. గ్రూప్ కమాండర్ ఎన్.సి.సి గ్రూప్ హెడ్ క్వార్టర్ (విశాఖ) కమోడోర్ సుమంత రాయ్, కమాండింగ్ ఆఫీసర్ లెప్టనెంట్ కల్నల్ య.కార్తీక్, ఏయూ ఎన్ సి.సి అధికారి డాక్టర్ ఎన్.ఎం యుగంధర్, ఎన్ సిసి అధికారులు, సిబ్బంది, క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేయడం సమాజ సేవ చేయడం.. -రక్తదానం అత్యుత్తమ మానవతా సేవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *