
విశాఖఎడ్యుకేషన్,ఫిబ్రవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆధ్యాత్మిక విద్యా రంగాలకు గర్వకారణమైన వేళలో ప్రపంచ ప్రఖ్యాత జైన సన్యాసి ఆచార్య డా. ముని ఆదర్శ్ జీ కి ప్రతిష్టాత్మకమైన “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన ఈ క్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థ డీన్ వాన్ లీవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థలు సంయుక్తంగా విశాఖపట్నంలోని ఐఐఎం లో అందజేశాయి. ఆర్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్. ఎస్.పి.రవీంద్ర, ఐఐఎఎం డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వి. కృష్ణమోహన్, ఈక్యూ4పీస్ (యుఎస్ఎ) వైస్-ప్రెసిడెంట్ డా. చల్లా కృష్ణవీర్ అభిషేక్ చేతుల మీదుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. జైన తత్వశాస్త్రం, ప్రివెంటివ్ వెల్నెస్ మరియు విలువల ఆధారిత విద్యా రంగాల్లో ఆచార్యజీ చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు. జైనిజంలో డాక్టరేట్ పట్టా పొందిన ఆచార్య డా. ముని ఆదర్శ్ జీ, ప్రాచీన జైన జ్ఞానాన్ని ఆధునిక మానవ వికాస నమూనాలతో సమన్వయం చేసిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా విశేష గౌరవం పొందారు. ఆయన రూపొందించిన “సెవెన్ కోడ్స్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ అండ్ వెల్-బీయింగ్” మరియు “ఫైవ్ ఇంటెలిజెన్సెస్ మోడల్” వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యం, మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యత మరియు అంతః ప్రజ్ఞ వంటి అంశాలను సమగ్రంగా సమన్వయపరుస్తాయి. నియంత్ ఎడ్యూవర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ద్వారా ఆయన నైతిక నాయకత్వం, యువ శక్తి అభివృద్ధి, జైన అధ్యయనాల పరిశోధన మరియు విలువల ఆధారిత రూపాంతర విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఆచార్యజీ సేవలను ప్రముఖులు ప్రశంసిస్తూ, ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయ దృక్పథాల మధ్య వారధిగా ఆయన కృషిని అభివర్ణించారు. కార్యక్రమం ముగింపులో శాంతి, భావోద్వేగ విద్య మరియు సమగ్ర శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు
