
విశాఖఎడ్యుకేషన్, డిసెంబర్ 28 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : 108 వ భారత ఆర్థిక సంఘం వార్షిక సమావేశం ఈ నెల 21 నుంచి 23 వరకు ఉస్మానియా యూనివర్శిటిలో జరిగింది. భారత ఆర్థిక సంఘ వార్షిక సమావేశానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం విశ్రాంత ఆర్థిక ఆచార్యుడు డాక్టర్ కొండపల్లి పరమేశ్వరరావు ఒక సెషన్ కు అధ్యక్షత వహించారు. వికసిత్ భారత్ - 2047 అభివృద్ధి చెందిన దేశ సాధన దిశగా వేస్తున్న అడుగులు అనే అంశంపై వివిధ ప్రముఖ ఆర్థిక వేత్తలు పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ సెషన్ కు అధ్యక్షత వహించిన విశ్రాత ఆర్థిక ఆచార్యులు డాక్టర్ కొండపల్లి పరమమేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల ప్రముఖ ఆర్థికవేత్తలు పరిశోధకులు పాల్గొని వారి పరిశోధన పత్రాలు సమర్పించి విధానం పై ప్రశంసించారు. భారతదేశంలో 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారడానికి ఆర్థిక వేత్తలు ఇచ్చిన సూచనలు సలహాలును ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ఇటీవల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులుకు, బడుగు బలహీన వర్గాలకు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుబాటులోకి రావడం ప్రశంసనీయంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
