

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు భాగంగా డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ సెంటర్ ఫర్ ఉమన్ స్టడీస్, డిపార్ట్మెంట్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్, సయుక్తoగా ఎండాడ జిల్లా పరిషత్ హై స్కూల్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు క్రీడలు వల్ల ఆరోగ్యం వలన చేకూరే విధానం గురించి తెలియజేశారు. చదువుతోపాటు ఆటలు అవసరమని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉషారాణి తెలిపారు. డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ పల్లవి మాట్లాడుతూ విద్యార్థులకు ఆటల వల్ల ఆరోగ్యం చేకూరుతుందని, అలాగే విద్యార్థులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దుర్గబాయ్ దేశ్ ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ రీసెర్చ్ అసోసియేట్స్ డాక్టర్ రవికుమార్, ఉషారాణి స్కాలర్స్ ఉదయ్, హరి, ఏంపీఈడి స్టూడెంట్స్ పాల్గున్నారు.


