
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విశాఖ రైల్వే స్టేషన్ పునఃనిర్మాణప్రక్రియలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వేబోర్డు సుముఖత వ్యక్తం చేసిందని విశాఖ పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో పర్యటించిన ఆయన నిర్మాణప్రక్రియపై అధికారులతో సమీక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైన ఈ ప్రాజెక్టుకు అదనంగా మరిన్ని హంగులు జోడిస్తున్నామని తెలిపారు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వేబోర్డు సుముఖత వ్యక్తం చేసిందన్నారు 8 ప్లాట్ ఫామ్ లని 14 కి పెంచి 16 రైల్వే లైన్లు వచ్చే విధంగా చేయబోతున్నట్లు వివరించారు పశ్చిమ వైపు భాగంలో వున్న చిన్న స్టేషన్ భవనాన్ని తొలగించి అదనపు ప్లాట్ ఫామ్ లను తీసుకువస్తామన్నారు..అది పూర్తయ్యాక జ్ఞానపురం వైపు అతిపెద్ద స్టేషన్ భవనం రూపు దిద్దుకుంటుందన్నారు దానికి ఆనుకొని ఏర్పాటు చేసే పార్కింగ్ లో 350 కార్లు, 1500 బైక్ లను నిలిపివుంచేందుకు అనువైన ప్రదేశం కేటాయిస్తామనన్నారు. ఇప్పుడున్న డ్రైన్లను కూడా మళ్లిస్తామన్నారు అది పూర్తయ్యాక తూర్పు వైపు వున్న ప్రస్తుత ప్రధాన రైల్వేస్టేషన్ భవనం స్ధానంలో కొత్తది నిర్మిస్తారని తూర్పు పశ్చిమ రైల్వే స్టేషన్ల భవనాలను ఎయిరో బ్రిడ్జ్ తో అనుసంధానిస్తారన్నారు ప్రస్తుతం వున్న ఎఫ్ఓబి లు మూడు, మూడున్నర మీటర్ల వెడల్పుతో వుండగా వాటి వెడల్పును కనీసం 12 మీటర్లకు పెంచనున్నట్లు తెలిపారు. పునఃనిర్మాణ రైల్వేస్టేషన్ ప్రాజెక్టులో భవిష్యత్ అవసరాల దృష్ట్యా, కేంద్ర రైల్వే మంత్రి కూడా G+ 11 అంతస్తుల నిర్మాణాలకు అనుగుణంగా పునాదులు వేయాలనే ప్రతిపాదనలను స్వాగతించారన్నారు…. మొదటి దశనిర్మాణాలు మూడు అంతస్తుల్లో రాబోతున్నట్లు తెలిపారు…..అందుకు తగిన విధంగా స్ట్రక్చరల్ రీ డిజైనింగ్ లో మార్పులను సూచించారని…మరో పది రోజుల్లో అది కాంట్రాక్ట్ ఆమోదం కూడా పొంద బోతున్నాము….భవన ఆకృతి మరింత ఆకర్షణీయంగా, ఆధునికంగా వుండేలా చూస్తున్నామన్నారు….. కొన్ని మార్పులు వెండార్ తో చర్చించి రైల్వే బోర్డ్ కు, రైల్వే మినిస్టర్ గారికి పంపించడం జరిగిందని దాని మీద తుది నిర్ణయం రావాలన్నారు…అది లభించిన వెంటనే 18 నుంచి 21 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వెండార్ సిద్దంగా వున్నారన్నారు పాత నిర్మాణాల తొలగింపు కోసం ఇప్పటివరకూ 20 కోట్లు ఖర్చు అయ్యిందన్నారు కొత్త నిర్మాణాలకు గ్రౌండ్ రెడీ అయ్యిందని తెలిపారు. కొత్త స్టేషన్ నిర్మాణ భవనాల్లో ప్రయాణీకులు ఓవర్ నైట్ స్టే చేసే వారికి విశ్రాంతి వసతి సౌకర్యాలు తీసుకువస్తామన్నారు. బిల్డింగ్ ప్లాన్స్ నిర్ణయమైతే పనులు త్వరగా ప్రారంభమవు తాయన్నారు. ఎయిర్ పోర్టుల్లో మాదిరిగా ఎగ్జిట్, ఎంట్రీలను ప్రణాళికా బద్దంగా తీసుకువస్తున్నామని, దీని రద్దీ సమయాల్లోగాని , విఐపి ల తాకిడి సమయంలో గాని ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగబోదన్నారు. కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖపట్నం డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు చలసానిగాంధీ, సి.ఏ.ఓ అంకుష్ గుప్తా, చీఫ్ ఇంజనీర్లు
రైల్వే స్టేషన్ డైరెక్టర్ లు పాల్గొన్నారు.
