
Visakhapatnam, November 24: విశాఖ కళాసాగర్ సంస్థ వ్యవస్థాపకు కరెడ్ల అప్పలరాజు కు నంది ఎక్సలెన్స్ అవార్డ్ రక్షా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని వారాహి హోటల్లో నంది ఎక్సలెన్స్ అవార్డ్స్- 2025 మహోత్సవం విజయవంతంగా నిర్వహించారు, వండర్ ఫుల్ అవుట్ స్టాండింగ్ విమెన్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు ఎల్ సందీప్ గౌడ్ మద్దతుతో ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. పారా స్పోర్ట్స్, సంగీతం, నృత్యం, ఉపాధ్యాయ వృత్తి, ఎన్టీవోలు, సామాజిక సేవా విభాగాల్లో సేవలందించిన వారికి సత్కారం లభించింది. సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రతిభావంతులను గుర్తించి త్సహించడం ఈ అవార్డుల ముఖ్య లక్ష్యం. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మొత్తం 120 మందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కరెడ్ల అప్పలరాజు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మాస్కులు శానిటేజీలు అవసరమైన సరుకులు పంపిణీ చేయడం, పేద విద్యార్థులకు బుక్స్ పెన్నలు, అన్న సమారాధన. వృద్ధులకు చీరలు, పళ్ళు పండ్లు అందజేస్తూ ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్లు నిర్వహించడంతోపాటు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, సేవా దృక్పథంతో బడుగు బలహీన వర్గాల వారికి వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవలు చేయడం, విద్యా వైద్య కళా రంగంతో పాటు కోవిడ్ కష్ట సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డుకు తనను ఎంపిక చేయడం జరిగిందని కరెడ్ల అప్పలరాజు ఆనందం వ్యక్తం చేస్తూ, నంది అవార్డు ఎంపిక చేయడం పట్ల రక్షా సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులకు స్వరూప కు ధన్యవాదాలు తెలియజేశారు.
