
Visakha Education, November : ఆంధ్రా యూనివర్సిటీ తత్వశాస్త్రం మరియు మతపరమైన అధ్యయనాల విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ ఫిలాసఫీ డే సెలబ్రేషన్స్- 2025 కార్యక్రమం విభాగ సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సమకాలీన ప్రపంచంలో తత్వవిచారణ యొక్క ప్రాముఖ్యతను ప్రతిపాదిస్తూ, తత్వశాస్త్ర విద్యా పరిశోధనల్లో ఆంధ్రా యూనివర్సిటీ పోపిస్తున్న కీలక పాత్రను ఈ సందర్భంగా ప్రముఖులు ప్రస్తావించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ప్రొఫెసర్ ఏ. నరసింహ రావు, ఆర్ట్స్ మరియు కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్, తత్వచింతన వ్యక్తి జీవితాన్ని, సామాజిక బాధ్యతను, ప్రజాస్వామ్య విలువలను బలపరుస్తుందని తన ప్రసంగంలో అన్నారు. గెస్ట్ ఆఫ్ హానర్ గా పాల్గొన్న ప్రొఫెసర్ ఎం.వి. కృష్ణయ్య, ఎమెరిటస్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ హానరరీ సాధారణ జీవితంలో తత్వపరిశీలనకు ఉన్న అవసరాన్ని, నేటి సాంకేతిక సామాజిక మార్పుల నడుమ తత్వదృష్టి అనివార్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రొఫెసర్ పి. జార్జ్ విక్టర్, మాజీ వైస్ చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ప్రొఫెసర్ వై.వి. సత్యనారాయణ, మాజీ సభ్యులు – ఐసీపీర్ తమ సందేశాలను అందించారు. తత్వశాస్త్ర బోధనలో విభాగం సంప్రదాయం, విద్యార్థుల్లో నైతిక-విమర్శనాత్మక దృష్టి పెంపొందించే అవసరాన్ని వారు వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ కె. రమేష్ బాబు, విభాగాధిపతి, తత్వశాస్త్ర విభాగం చేపడుతున్న పరిశోధనా కార్యక్రమాలు, విద్యార్థులలో తత్వచింతనను ప్రోత్సహించే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతులు ఆచార్య పీటేటి ప్రేమానందం అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, ఫిలాసఫీ విభాగ అధ్యాపకులు, అతిథి అధ్యాపకులు డాక్టర్ అల్లాడి వీరభద్రరావు, డాక్టర్ ముసుగు ప్రసాదు, డాక్టర్ పద్మజ, డాక్టర్ దేవదానం డాక్టర్ దాక్షాయిని పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు, అధ్యాపక ఇతర సిబ్బంది జి. నిర్మల మరియు ప్రిన్సిపాల్ ఆఫీస్ సిబ్బంది డాక్టర్ సింగులూరి వీరకుమార్ పాల్గొన్నారు.
