
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 20 : చమురు సహజ వాయువు సంస్థ ఓఎన్ జిసి కృష్ణా గోదావరి బేసిన్ రాజమహేంద్రవరంకు సంబంధించిన భారీ పరిశోధన ప్రాజెక్టును ఆంధ్రవిశ్వవిద్యాలయం డెల్టా అధ్యయన సంస్థ కు అందించింది. ప్రతిష్టాత్మకమైన 1.1 కోట్ల రూపాయల పరిశోధన ప్రాజెక్ట్లను లభించడం పట్ల ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా-గోదావరి కె.జి, పి. జి బేసిన్ డెల్టా ప్రాంతాలలో హైడ్రోకార్బన్ అన్వేషణ వినియోగం కారణంగా సంభవించే భూమి కుంగిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలను అధ్యయనం చేసి, గుర్తించడం ఈ పరిశోధన ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంది. అదే విధంగా కెజి బేసిన్ అంతటా ఏర్పాటు చేయబడిన పర్యవేక్షణ కేంద్రాల మానిటరింగ్ స్టేషన్స్ వద్ద పరిశోధనలు చేస్తుంది. భూమి యొక్క నిలువు కదలికలను వెర్టికల్ మూవ్మెంట్ కచ్చితంగా పర్యవేక్షించడానికి అంచనా వేయడానికి సింథటిక్ అపెర్చర్ రాడార్ ఎస్ ఏ ఆర్ ఇంటర్ఫెరోమెట్రీ మరియు కెజిపిఎస్. కె జి పి ఎస్. ఆధారిత ఫీల్డ్ అధ్యయనాలు వంటి అధునాతన సాధనాలను ఉపయోగిస్తారు. ఈ సాంకేతికతలు భూమి కుంగిపోయే నమూనాలను సబ్సిడెన్స్ పట్టేర్న్స్అర్థం చేసుకోవడానికి కీలకమైన ఖచ్చితమైన డేటాను అందిస్తాయని భావిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరపుకుంటున్న సంవత్సరంలో ఇటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు లభించడం పట్ల ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్, ఏయూ డెల్టా స్టడీస్ సెంటర్ సంచాలకులు ఆచార్య కె. సత్యనారాయణ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు.
