పూర్వవిద్యార్థుల సంఘం వార్షిక సమావేశం డిసెంబర్ 13న – ముఖ్య అతిధిగా హాజరు కానున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మూర్తి ట్రస్ట్ చైర్ పర్సన్ సుధా మూర్తి… -వివరాలు వెల్లడించిన ఏఏఏ చైర్మన్ -పూర్వవిద్యార్థులను అసుంధానం చేస్తాం …-ఏయూ వైస్ చాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్

ఎడ్యుకేషన్

విశాఖఎడ్యుకేషన్, డిసెంబర్ 9 : ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం వేవ్స్ 2025 కార్యక్రమం డిసెంబర్ 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంఘం చైర్మన్ కె.వి.వి రావు తెలిపారు. మంగళవారం ఏయూ ఆలుమ్ని జిఎంఆర్ సెమినార్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహిళా సాధికారత దీంతో ఈ సంవత్సరం ఆలుమ్ని సమావేశం వేవ్స్-2025 ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్న రాజ్యసభ సభ్యురాలు, రచయిత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి సుధా మూర్తి హాజరవు తున్నారన్నారు. విశ్వవిద్యాలయం వందేళ్ల వేడుకలను జరుపుకుంటున్న సమయంలో ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. మధ్యాహ్నం 3 గంటల బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏయూ ఆలుమ్ని వ్యవస్థాపక అద్యక్షులు డాక్టర్ జి.ఎం రావు తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి 10 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ప్రధాన వేదికతతో పాటు ప్రాంగణం వెలుపల ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నుంచి ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ 13వ తేదీ మద్యాహ్నం ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగా రెడ్డి విగ్రహానికి ముఖ్య అతిధి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారన్నారు. వార్షిక పూర్వవిద్యార్థుల సమావేశానికి వర్సిటీ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికంగా విద్యార్థినులు పాల్గొనాలని ఆహ్వానిస్తున్నామన్నారు. ఆలుమ్ని సదస్సు నిర్వహణకు సంపూర్ణ సహకారం అందించడం జరుగుతోందన్నారు. ఈ సందస్సులో ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన ఏయూ పూర్వ విద్యార్థులను అనుసంధానించడం, విశ్వవిద్యాలయం అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తామన్నారు. విశ్వవిద్యాలయం భవిష్యత్ ప్రణాళికలను వారికి వివరించే ప్రయత్నం చేస్తామన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏయూ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలను సిద్ధం చేసామని, వాటిలో పూర్వవిద్యార్థులను సైతం భాగస్వాములను చేస్తామన్నారు. డిసెంబర్ 13వ తేదీన ఉదయం ప్రతీ విభాగంలో పూర్వవిద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థుల వార్షిక సమ్మేళనం వేవ్స్-2025 కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్ను వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ఆలుమ్ని చైర్మన్ కె.వి.వి రావుతో కలసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కె.కుమార్ రాజ, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఇసి సభ్యులు డాక్టర్ ఎస్.కె. ఇ అప్పారావు, ఆచార్య బి. మోహన వెంకట రామ్, వై.వి అనురాధ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *