శాస్త్ర జ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.. ఏయూ మాజీ వీసీ, సెంచూరియన్ వర్సిటీ చాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు

ఎడ్యుకేషన్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 06 : విద్యార్థులు శాస్త్ర విజ్ఞానాన్ని పొందడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలని ఏయూ మాజీ వీసీ, సెంచూరియన్ వర్సిటీ చాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు అన్నారు. శనివారం ఏయూ ఈసీఈ విభాగంలో నిర్వహించిన విభాగ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విభాగ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన విద్యార్థి దశలో అలవరచుకోవాలన్నారు. ఉన్నతంగా రాణించాలంటే కష్టించాలన్నారు. ముందుగా నిత్యం తరగతులకు హాజరు కావడం విద్యార్థి నేర్చుకోవాలన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఇసిఈ విభాగం ఆవిర్భాగం, ప్రగతిని ఆయన వివరించారు. విభాగ పూర్వవిద్యార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆచార్య జి.ఎస్.ఎన్ రాజును సత్కరించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణ రావు మాట్లాడుతూ ప్రతీ వ్యక్తికి సహాయం చేసే తత్వం ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు నుంచి నేర్చుకోవాలన్నారు. విభాగానికి మార్గదర్శిగా, స్ఫూర్తిని అదించే వ్యక్తిగా ఆయన నిలుస్తారన్నారు. విభాగాధిపతి ఆచార్య పి.వి శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థిగా, పరిశోధకురాలిగా, సహోద్యోగిగా ఆచార్య జి.ఎస్. రాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు దార్శినికత తమ జీవితాలను మలచిందన్నారు. నేటితరం విద్యార్థులకు ఆయన రోల్ మోడల్గా నిలుస్తారన్నారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు పి. రాజేష్ కుమార్, డాక్టర్ ఎస్.అరుణ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా విభాగ అభివృద్ధిని ఆర్థిక సహాకారం అందించి పలు మౌళిక వసతులను సమకూర్చిన 1989-93 బ్యాచ్ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పూర్వవిద్యార్థులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *