
Visakhapatnam, November 20: ఉత్తర నియోజకవర్గంలోని అక్కయ్యపాలెం సాధిఖాన కళ్యాణమండపంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 పథకం కింద ఉత్తర నియోజకవర్గానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2,50,000 విలువైన గృహ నిర్మాణ ఆమోదపత్రాలు ఘనంగా పంపిణీ చేయబడ్డాయి. ఈ పథకం లో కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు కలిపి రెండున్నర లక్షల రూపాయలు ఒక్కొక్కరికి లబ్ధిదారులకి నాలుగు దఫాలుగా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు మరియు ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణుకుమార్ రాజు లబ్ధిదారుల చేతికి ఆమోద పత్రాలు అందజేశారు. పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు మాట్లాడుతూ లబ్ధిదారులు ఈ పథకాన్ని పెద్దఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. ఎవరికైనా సొంత స్థలం గాని పట్టా పొందిన స్థలము ఉన్న ఎడల ఈ పథకానికి అర్హులు శాశ్వత గృహ నిర్మాణం కొరకు కూడా ఈ పథకానికి ఈ పథకం ఉపయోగించుకోవచ్చు కావలసినవారు ఎమ్మెల్యే ఆఫీసులో కానీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను కలిసి సంప్రదించవలసిందిగా కోరారు. ప్రతి ఇంటికి సౌర శక్తి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఇటీవల మహిళల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తమ ఆధ్వర్యంలోని మెడికల్ హాస్పిటల్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర నియోజకవర్గంలో భారీ సంఖ్యలో లబ్ధిదారులు ఎంపిక కావడం హర్షణీయమని, దీనికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృషి విశేషమని అభినందించారు. ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఇల్లు నిర్మాణ ప్రక్రియలో ఎవరు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇంకా ఎక్కువ మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. గత ప్రభుత్వంలో కేవలం రూ.1,80,000 మాత్రమే అందించగా, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.2,50,000 కు పెంచి, దశలవారీగా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గారు సత్తిబాబు గారు డిఈ గారు ప్రసాద్ రావు గారు ఏఈ గారి ప్రభ గారు నార్త్ ఆఫీస్ ఇన్చార్జి శ్యామల దీపిక గారు , కోయలడ వెంకటేష్ కార్పొరేటర్లు ప్రముఖ నాయకులు వారి అధ్యక్షులు మండల అధ్యక్షులు పాల్గొన్నారు
