ఆంధ్రా విశ్వకళాపరిషత్ తెలుగు శాఖ గ్రంథ ఆవిష్కరణలు

General
Visakhapatnam, November 18 :  మూడు గ్రంథాలు ఆంధ్రా విశ్వకళాపరిషత్ తెలుగుశాఖలో  18   న సమావేశమందిరంలో ఆవిష్కరించబడ్డాయి.   సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రా విశ్వకళాపరిషత్ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య అప్పారావు మాట్లాడుతూ రచయితల సామాజిక దృక్పథాన్ని గురించి కొనియాడారు. ‘సందువ’ కవిత్వంలో శ్రీకాకుళం     జిల్లాలో ఉన్నటువంటి అణగారిన పేద ప్రజల జీవితాన్ని గురించి, ఉద్దానము సమస్యలని గురించి, కిడ్నీ బాధితుల సమస్యల గురించి ఇందులో ప్రస్తావించారు. మత్స్యకారులు అమ్ముకునేటువంటి చేపలలో ఒకదాని పేరు’ సందువ’ ఆ పేరుని పుస్తక గ్రంథానికి పెట్టడం ఉచితంగా ఉందని శాఖాధ్యక్షులు అభినందించారు. యుద్ధము కవిత సంపుటిలో భారతదేశంలో ఉన్న కుల, మత వ్యవస్థలు గూర్చి చర్చించటం ద్వారా రచయిత దైర్యాన్ని మెచ్చుకున్నారు.  ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్ ఆచార్య అడ్డాడ నరసింహారావు గారు మాట్లాడుతూ తెలుగు శాఖలో ఈ పుస్తకావిష్కరణ చేయడం ఆనందంగా ఉంది అని, వేమన శతకంలా భీమరాయ శతకం కూడా గొప్పదని తన అభిప్రాయం తెలియజేశారు. ఆచార్య గజ్జ యోహాను బాబు  గ్రంథాలు ఆచార్య వెలమల సిమ్మన్న  ఈ ఆవిష్క   రణలు తెలుగు శాఖ గొప్పతనం గురించి తెలియజేస్తాయి. అందుకు రచయితలకు అభినందనలను సిమ్మన్న గారు తెలియజేశారు. భీమకవి చోడగిరి చందర్రావు “సమగ్ర కవిత్వము “గ్రంథము  డాక్టర్ కోయ కోటేశ్వరరావు గారు సంపాదకత్వంలో వెలువరించబడుతుంది. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్ ఆచార్య అడ్డాడ నరసింహారావు గారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు   పరిశోధక విద్యార్థి ఎల్.మురళీధర్ ఈ గ్రంథాన్ని సమీక్షించారు.  బాల సుధాకర్ మౌళి రాసిన  సందువ’  గ్రంథాన్ని ఆచార్య గజ్జా యోహాన్ బాబు గారు ఆవిష్కరించారు. ఈ గ్రందము పై అతిథి అధ్యాపకు రాలు డాక్టర్ ఎం. ఎన్. కృష్ణవేణి గారు సమీక్షించారు. మరియు బాల సుధాకరమౌళి రాసిన “యుద్ధములో” అనే గ్రంథాన్ని ఆచార్య వెలమల సిమన్న ఆవిష్కరించారు. సందువ ‘మరియు’ యుద్ధంలో’ గ్రంథాలు రాసిన బాల సుధాకర్ మౌళి మాట్లాడుతూ కళింగ అస్తిత్వానికి సం బంధించిన విషయాలను ప్రస్తావిస్తూ సందువ గ్రంధాన్ని రా చెప్పుకొచ్చారు. రాజకీయ సామాజిక విశ్లేషణలను ‘ యుద్ధము’ కవిత సంపుటి ద్వారా తెలియపరిచారు.  ఆవిష్కరించబడ్డాయి. ఈ మూడు గ్రంథాలలో సామాజిక చైతన్యం ప్రతిబింబిస్తుంది. ఈ ఆవిష్కరణలు తెలుగు శాఖ గొప్పతనం గురించి తెలియజేస్తాయి. అందుకు రచయితలకు అభినందనలను సిమ్మన్న తెలియజేశారు. భీమకవి చోడగిరి చందర్రావు “సమగ్ర కవిత్వము ” గ్రంథము  డాక్టర్ కోయ కోటేశ్వరరావు గారు సంపాదకత్వంలో వెలువరించబడుతుంది. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్ ఆచార్య అడ్డాడ నరసింహారావు గారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. పరిశోధక విద్యార్ధి ఎల్.మురళీధర్ ఈ గ్రంథాన్ని సమీక్షించారు.  బాల సుధాకర్ మౌళి రాసిన ‘ సందువ’ గ్రంథాన్ని ఆచార్య గజ్జా యోహాన్ బాబు గారు ఆవిష్కరించారు. ఈ గ్రంథము పై అతిథి అధ్యాపకురాలు డాక్టర్ ఎం.ఎన్. కృష్ణవేణి గారు సమీక్షించారు. మరియు బాల సుధాకరమౌళి రాసిన “యుద్ధములో” అనే గ్రంథాన్ని ఆచార్య వెలమల సిమన్న ఆవిష్కరించారు. ‘ సందువ ‘ మరియు ‘ యుద్ధంలో’ గ్రంథాలు రాసిన బాల సుధాకర్ మౌళి మాట్లాడుతూ  కళింగ అస్తిత్వానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ సందువ గ్రంథాన్ని రాశానని చెప్పుకొచ్చారు.రాజకీయ సామాజిక విశ్లేషణలను యుద్ధము’ కవిత సంపుటి ద్వారా తెలియపరిచారు. ఈ గ్రంథాన్ని అతిధి అధ్యాపకులు డాక్టర్ ఎం. ప్రతాప్ గారు సమీక్షించారు. N. బాలరాజు   చోడగిరి చందర్రావు సాహితీ జీవితం గూర్చి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో చోడగిరి చంద్రరావు గారి గురించి వారి కుమారుడు సిహెచ్ అంబేద్కర్, కుమార్తె లలితా దేవి, అల్లుడు బాలరాజు ప్రసంగించి ఆయన గొప్పతనాన్ని తెలియజేశారు . ఈ సభకు పరిశోధక విద్యార్థి జి. బాబి స్వాగతం పలకగా, ప్రార్ధనగీతమును తెలుగు శాఖ స్నాతకోత్తర విద్యార్థులు ఆలపించారు. డాక్టర్ పులపర్తి శ్రీనివాస రావు గారు మూడు గ్రంథాల యొక్క విశిష్టత తెలియజేశారు. ద్వితీయ సంవత్సర విద్యార్థి బి.చందు కుమార్ వందన సమర్పణ సభా ముగిసింది. ఈ సభలో పురప్రముఖులు, భాషాభిమానులు, సాహిత్యాభిమానులు, పరిశోధక విద్యార్థులు, స్నాతకోత్తర విద్యార్ధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *