Visakhapatnam, November 13 : ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ దుర్గాబాయ్ దేశముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో మహిళల సేఫ్టీ సైబర్ క్రైమ్ పై అవగాహన జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాబాయ్ దేశముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఎ.పల్లవి అధ్యక్షులు గా వ్యవరించిన కార్యక్రమం లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం ముఖ్యఅతిథి గా
పాల్గొని సైబర్ క్రైమ్ మహిళల సేఫ్టీ గురించి విద్యార్థిణులకు వివరించారు. ప్రభుత్వ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అందుబాటులో ఉందన్నారు. మహిళలు, పిల్లలు పై ఏటువంటి అరాచకాలు చేసిన సైబర్ క్రైమ్ దృష్టి సారించిందన్నారు. డాక్టర్ దుర్గాబాయ్ దేశముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఎ.పల్లవి మాట్లాడుతూ ర్యాగింగ్, మహిళలు పై అరాచకాలు, ఆన్ లైన్ మోసాలు వంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాటిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కా ర్యక్రమంలో డాక్టర్ ఉషా, డాక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు.
