విద్యార్థులు ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందాలి

ఆంధ్రప్రదేశ్‌
Andhra University Botony : ఆంధ్రవిశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగంలో విద్యార్ధులు ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందడానికి, హరిత క్యాంపస్ను నిర్వహించడా నికి విద్యార్థుల చురుకైన భాగస్వామ్యం అవసరమని విభాగాధిపతి ఆచార్య డి సంధ్య దీపిక అన్నారు విద్యార్థులకు వారి స్వంత  ఆసక్తి ఆధారంగా నిర్దిష్ట విషయాలపై ఆచరణాత్మక జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశాలను విభాగంలో కల్పించారు.  విద్యా కార్యకలాపాలలో భాగంగా ప్రతి శుక్ర, శనివారాలలో మధ్యాహ్నం పనివేళల్లో హెర్బేరియం, మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ప్రయోగశాలలు వంటివి సందర్శించాలన్నారు. విభాగం అందించే వనరులు, సౌకర్యాలను కూడా ఆమె విద్యార్థులకు ఈ సందర్భంగా వివరించారు. క్యాంపస్ను పరిశుభ్రంగా మరియు పచ్చగా ఉంచడంలో విద్యార్ధులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. కార్యక్రమాల పర్యవేక్షించడానికి క్యూరేటర్ గా డాక్టర్ జె. ప్రకాశరావును అధికారులు ఏర్పాటు చేసారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *