
Visakhapatnam, November 15 : జన జాతీయ గౌరవ్ ది వస్ (జెజెజిడి) – 2025 ఉత్సవా ల భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ, ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ (టీసీఆర్ & టీఎం) ఆధ్వర్యంలో విశాఖపట్నం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా ఈవెంట్ దర్తి అబ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి విశిష్ట అతిథులు పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, గిరిజన సంక్షేమ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రులు, గుమ్మిడి సంధ్యారాణి, చైర్మన్, జిసిసి; కిడారి శ్రావణ్ కుమార్, శాసన మండలి సభ్యులు; శ్రీనివాసులు నాయుడు, నరసన్నపేట శాసన సభ సభ్యులు బి రమణ మూర్తి, న్యూఢిల్లీ; డైరెక్టర్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమీధా సింగ్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ, టీసీ ఆర్ &టీమ్ అధికారులు, కేంద్ర–రాష్ట్ర ఉద్యోగులు, వివిధ ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారులు, అన్ని ఐటిడిఏలకు చెందిన ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమా నికి ఆహ్వానిస్తూ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలిపారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు గిరిజనులకే కాక, సమస్త భారత ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. చరిత్రలో కనుమరుగైన గిరిజన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడంలో భారత ప్రధానమంత్రి చేపట్టిన జానజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమం ఒక చారిత్రక చర్య అని పేర్కొన్నారు. తదుపరి, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలపై సమగ్ర పరిశోధనలు చేసి వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తూ వారి హక్కులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న టీసీఆర్ & టీఎం కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
