అల్ట్రా సౌండ్ పరికరం బహుకరణ

ఆంధ్రప్రదేశ్‌
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 8 :  జిల్లా విశ్రాంత న్యాయమూర్తి సలాది నరసింహారావు, శనివారం విశాఖ లయన్స్ కాన్సర్ జనరల్ హాస్పిటల్ ను సందర్శించి వారి తండ్రి సలాది గంగరాజు జ్ఞాపకార్థం హాస్పిటల్ లోని అల్ట్రా సౌండ్ కలర్ డాప్లర్ గది ఆధునీకరణ కోసం ఉదారంగా ఒక లక్షా యాభై వేలు రూపాయలు విరాళం చెక్ రూపంలో అందించారు. సమాజంలోని అన్ని రకాల రోగులకు వైద్య సహాయం చేయడంలో హాస్పిటల్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సలాది నరసింహారావు హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు అభినందించారు.
                              క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుందాం
ప్రతి సంవత్సరం నవంబర్ 7న “జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని (నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే)”ను 2014 నుంచి జరుపుకుంటున్నారు. క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, నివారణ చర్యలు మరియు ముందస్తుగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. శరీరంలోని ఏదైనా ఒక అవయవ భాగంలో కణజాలం అపరిమితంగా, నియంత్రణ లేకుండా పెరగడం, ఇతర కణజాలాలకు వ్యాపించడం కారణంగా ఆయా భాగాల్లో గడ్డలు ఏర్పడడాన్ని క్యాన్సర్ వ్యాధిగా చెప్పవచ్చు. అతి ప్రమా దకర, ప్రాణాంతక క్యానర్స్కు సరైన చికిత్స లేదు. తొలి దశలో గుర్తించడం వలన చికిత్సతో నయం చేయవచ్చు. క్యాన్సర్ రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మన చేతుల్లో ఉందని గమనించాలి. క్యాన్సర్ పట్ల పూర్తి అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు, చికిత్సా మార్గాలు, తొలి దశలో గుర్తించడం లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని గుర్తించడం ద్వారా చికిత్స అందించడం జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధికి చాలా మందిలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించని కారణంగా తొలి దశలో గుర్తించడం కొంచెం కష్టంగా మారింది. కాబట్టి ఇప్పుడు కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *