విద్యార్థులు మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలి …. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీ రామరాజు

ఆంధ్రప్రదేశ్‌

                                                                                            Visakhapatnam,November 13: విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీ రామరాజు సూచించారు. డామాట్లాడుతున్న ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీ రామరాజుక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో బుధవారం నిర్వహించిన విద్యార్థులకు మానసిక సమస్యలపై ఆ వగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కళాశాల విద్య నుంచి వి ద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుందని, ఆ ఒత్తిడిని అధిగమిస్తే మంచి భవి ష్యత్తు ఉంటుందన్నారు. ఒత్తిడి నియంత్రణకు ధ్యానం, యోగా చేయా లని సూచించారు. ముఖ్యంగా భయం, కష్టంగా చదవకుండా సబ్జెక్టుపై ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఏ రోజుకు ఆ రోజు సిలబస్ నేర్చుకుంటే పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదన్నా రు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఐ. విజయబాబు, వైస్ ప్రిన్సిపాల్ పి.జయ, కో-ఆర్డినేటర్ లక్ష్మణరావు, రవిబాబు, రాజేశ్వరరావు, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *