బుల్లయ్య కళాశాల విద్యార్థులు బాక్సింగ్ ప్రతీభ

క్రీడలు
బుల్లయ్య కళాశాల విద్యార్థులు బాక్సింగ్ ప్రతీభ

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 12  : ఏ యూ అంతర్ కళాశాలల మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల 11 వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల విద్యార్థులు బి ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హీనా 48 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని, ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న మల్లికా 51 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని, బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న సౌజన్య 54 కేజీల విభాగంల కాంస్య పతకాన్ని, బిఏ తృతీయ సంవత్సరం చదువుతున్న ఆర్షిత 57 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించి బుల్లయ్య కళాశాల ఓవర్ ఆల్ టీం ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది.మరియు ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎస్ జి ఎస్ మల్లిక బెస్ట్ బాక్సర్ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ కరస్పాండెంట్ డాక్టర్ జి. మధు కుమార్ గారు విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.ఎస్.కె చక్రవర్తి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి.దీపక్ చౌదరి ,వ్యాయామ విభాగాధిపతి డాక్టర్ వై. శ్రీనివాసరావు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్.ఎస్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *